Suryaa.co.in

Andhra Pradesh

నాకొద్దీ వాలంటరీ ఉద్యోగం…రాజీనామా చేసిన వాలంటరీ

ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సచివాలయం పరిధిలో పని చేస్తున్న గ్రామ వాలంటరీ వెంకటేష్ తన వాలంటరీ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. స్థానిక నాయకులు గ్రూపులుగా విడిపోయి ఏ పని చేసిన తము చెప్పినట్లుగా చేయవలసిందే అని వైసీపీ నాయకులు పట్టుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ప్రభుత్వం ఇచ్చే పథకాలు వైసిపి పార్టీ వ్యక్తులకే వర్తింప చేసేలా చూడాలంటూ ఒత్తిడి చేస్తున్నారని అన్నాడు.
అంతే కాకుండా వృద్ధాప్య పెన్షన్ లను రీ వెరిఫికేషన్ సమయంలో నాయకులు తమకు గిట్టనివారి కి పెన్షన్లు నిలుపుదల చేయవలసిందే అని పట్టుబడుతున్నారని అందుకు ఒప్పుకోలేదని నాపై దొంగ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ విషయంపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన తమ చేతుల్లో ఏమీ లేదని సమాధానం చెప్పినట్లు తెలిపాడు. దీంతో వెంకటేష్ తన వాలంటరీ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఎంపీడీవో నర్సయ్యకు రాజీనామా లేఖను సమర్పించాడు.

LEAVE A RESPONSE