Suryaa.co.in

అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు రోడ్డు ప్రమాదంలో మృతి
Andhra Pradesh

అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు రోడ్డు ప్రమాదంలో మృతి

ప్రముఖ వైఖానస ఆగమ పండితులు, ద్వారకాతిరుమల ఆగమ పాఠశాల మాజీ ప్రిన్సిపాల్, తిరుమల తిరుపతి వేద యూనివర్సిటీ డీన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు రోడ్డు ప్రమాదంలో ధర్మపత్ని సహితంగా మృతి చెందడం వైఖానసులకు తీరని లోటు. ఈయన మృతి వైఖానస కులంలో ద్రువతార రాలినట్లు అయింది. వైఖానస ఆగమ శాస్త్రం లో సంపూర్ణ పరిజ్ఞానాన్ని సంపాదించుకుని ఆగమశాస్త్రం లోనే కాకుండా వాస్తు జ్యోతిష్యం సంస్కృత భాషల్లో కూడా పాండిత్యాన్ని సంపాదించి తాను పొందిన విద్యను అనేకమందికి పంచిపెట్టి ఆయన జీవితానికి ఒక గుర్తింపు, విలువను సంపాదించుకున్నారు.

LEAVE A RESPONSE