Suryaa.co.in

Andhra Pradesh

మహాపాదయాత్రకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు

-టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రకు సంఘీభావంగా ఈనెల 15, 16వ తేదీల్లో (రేపు, ఎల్లుండి) రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంఘీభావ ర్యాలీలు నిర్వహించి, రైతులకు మద్దతు తెలపాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు విజ్ణప్తి చేస్తున్నాం. ఈనెల 15న జోన్-3, జోన్-4, జోన్-5 పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో, ఈనెల 16న జోన్-1, జోన్-2 పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహించి అమరావతి ఆవశ్యకతను చాటి చెప్పాలి.

LEAVE A RESPONSE