తెదేపా ప్రధాన కార్యాలయం మంగళగిరిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నారా చంద్రబాబునాయుడు ప్రసంగించారు. బాబు ఏమన్నారంటే..క్రైస్తవ సోదరీ, సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ రోజు ఒక పవిత్రమైన దినం. ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతీక క్రిస్టియానిటీ. ప్రభుత్వం తరపున మొట్టమొదటిగా సెమీ క్రిస్మస్ వేడుకలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే.
శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెబుతుంటే… వైసీపీ వాళ్లు తన సొంత పార్టీ వారిని కూడా క్షమించే పరిస్థితుల్లో లేరు.ఒంగోలులో సుబ్బారావు గుప్తాను కొట్టి మోకాళ్లపై నిలబెట్టారు.గుంటూరు పెదనందిపాడులో వెంకట నారాయణ అనే దళితుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. విశాఖపట్నంలో జగదీశ్వర్ రావు కు చెందిన రూ. 500 కోట్ల విలువ గల హయగ్రీవ ఇన్ ఫ్రా ను అక్రమంగా లాక్కున్నారు.
22 సంవత్సరాల టిడిపి పాలనలో రాష్ట్రంలో శాంతి భధ్రతలను కాపాడా. కానీ, నేడు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. సేవ అనేది బైబిల్ కి పునాదిగా జీసస్ బోధించారు.క్రిస్టియన్ సంస్థలు స్కూళ్లు,
కాలేజీలు, హాస్పిటల్ లు నెలకొల్పి సేవ చేస్తున్నాయి. సేవాధృక్పదంతో ఏర్పాటు చేసిన ఎయిడెడ్ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ 1926 నుంచే విద్యాపరంగా సేవ చేస్తోంది. ఎన్టీ రామారావు లాంటి దిగ్గజాలు చదువుకున్న కాలేజీ ఇది.ఆంధ్ర లయోలా కాలేజీ 1953 నుంచి పని చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇలాంటి క్రిస్టియన్ కాలేజీలలో చదువుకుని గొప్పవారయ్యారు.స్వాతంత్యం వచ్చిన నాటి నుంచి అన్ని ప్రభుత్వాలు ఎయిడెడ్ కాలేజీలకు గ్రాంటు ఇచ్చి ప్రోత్సహించాయి. కానీ, అలాంటి విద్యా సంస్థలను కూడా జగన్ రెడ్డి దోచుకోవాలని చూశారు.
ఇలాంటి పాలకులను చూస్తే బాధేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రిస్టియన్ల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి… వారి అభివృద్ధికి పెద్దపీట వేశాం.చర్చీల నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం చేశాం. దుల్హన్ పథకం కింద క్రైస్తవ ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా రూ. 50 వేలు ఇచ్చాం. గుంటూరులో రెండు ఎకరాలలో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి భూమిని కేటాయించి రూ. 10 కోట్లు ఖర్చు చేసాం. అదనంగా మరో రూ.6 కోట్లు మంజూరు చేశాం. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ కు సమీపంలో గల CSI చర్చి సెయింట్ బాసిల్లికా కు రూ. 1.5 కోట్ల ఆర్ధిక సహాయం చేశాం క్రిస్టియన్ సేవా సంస్థలకు, అనాధ శరణాలయాలకు రూ. 5 లక్షల నుంచి రూ 10 లక్షల వరకు ఆర్ధిక సహాయం చేశాం.
క్రైస్తవ శ్మశాన వాటికలకు భూసేకరణ చేసి నిధులు కేటాయించి నిర్మాణం మొదలు పెట్టాం.క్రైస్తవుల పవిత్ర స్థలం జెరూసలేం సందర్శించాలనుకునే క్రైస్తవులకు రూ. 75,000 ఆర్ధిక సాయం చేశాం.క్రిస్ మస్ కానుకలో భాగంగా ఆరు రకాల సరుకులు…. గోధుమపిండి, నెయ్యి, కంది పప్పు, నూనె, శనగపప్పు, బెల్లం
ఉచితంగా సరఫరా చేశాం. క్రిస్టియన్ మైనారిటీ విద్యార్ధుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, టూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేశాం. మీ అందరి ఆశీస్సులతో మరలా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. యేసు క్రీస్తు ఆశ్వీర్వాదాలతో మరలా ఈ పథకాలన్నింటిని అమలు చేసుకుని మన బిడ్డల పురోభివృద్ధికి పాటుపడుదాం. అందరికీ మరో మారు క్రిస్ మస్ శుభాకాంక్షలు.
కింజారపు అచ్చెన్నాయుడు : తెదేపా రాష్ట్ర అధ్యక్షులు
క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అన్ని మతాల వారిని సమాన దృష్టితో చూసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని మతాల వారు ప్రశాంతంగా జీవించారు. కానీ, జగన్ రెడ్డి నేడు మతాల మధ్య, ప్రాంతాల మధ్య కుమ్ములాటలు పెడుతున్నారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నాడు.
నక్కా ఆనంద్ బాబు – మాజీ సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు
అధికారంలో ఉన్నా, లేకున్నా క్రిస్మస్ వేడుకలను తెలుగుదేశం పార్టీ ఘనంగా జరుపుకుంటుంది.
నీ వలే నీ పొరుగువారిని ప్రేమించమని క్రిస్టియానిటీ చెబుతుంటే…జగన్ రెడ్డి తనను తాను ప్రేమించుకోవడం తప్ప చేస్తున్నది ఏమీ లేదు.
ఎం.ఎస్ రాజు – తెదేపా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్
తెలుగుదేశం పార్టీ క్రైస్తవుల అభృద్ధికి అనేక పథకాలు అమలు చేసి వారి పురోభివృద్ధికి పాటు పడింది. దుల్హన్ పథకం ద్వారా క్రైస్తవ ఆడబిడ్డల వివాహాలకు రూ. 50,000 లు ఆర్ధిక సహాయం చేసింది. దానిని ఇప్పుడు జగన్ రెడ్డి నిలిపివేశారు.
మద్ధిరాల మ్యాని – మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్
క్రిస్టియన్ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి క్రిస్టియన్లను సర్వనాశనం చేశారు.
క్రైస్తవులకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి రూ. 100 కోట్ల బడ్జట్ ను ఇచ్చిన ఏకైన నాయకుడు చంద్రబాబు నాయుడు.
నేను కార్పొరేషన్ చైర్మన్ గా అనేక మంది క్రిస్టియన్లకు ఉపాధి అవకాశాలు కల్పించాం.
కార్యక్రమంలో పాల్గొన్న వారు…పీతల సుజాత, మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు, రెవరెండ్ కుమార్ , మానుకొండ శ్రీనివాస్ , రెవరెండ్ జోషి రాజన్న.