ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయారు. కబడ్డీ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో సీఎం కప్ టోర్నీని ప్రారంభించారు. ఆ తర్వాత అందర్నీ ఉత్సాహపరిచేందుకు సరాదాగా కొద్దిసేపు గేమ్స్ ఆడారు.. ముందు క్రికెట్ ఆడిన తమ్మినేని.. తర్వాత కబడ్డీ ఆడారు. కూతకు వెళ్లిన సమయంలో పరిగెడుతూ అదుపుతప్పి కింద పడిపోయారు. వెంటనే
అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది తమ్మినేని సీతారాంను పైకి లేపి సపర్యలు చేశారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్రీడల్లో ఇవన్నీ సర్వ సాధారణమే అని మళ్లీ ఆయన ఉత్సాహంగా ఆటల్లో తిరిగి పాల్గొన్నారు.