Suryaa.co.in

Entertainment

హీరో నాని ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి:నట్టికుమార్

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఏపీ సినిమా టికెట్‌ ధరల విషయం మరోసారి వివాదాన్ని రాజేసింది. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయంటూ నాని చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్‌ తప్పుపట్టారు.ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరలు, కలెక్షన్స్‌, షేర్స్‌ గురించి సరైన అవగాహన లేకుండా నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. నాని వెంటనే ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘సినిమా టికెట్ల ధరల విషయంలో మేము ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మరోవైపు కోర్టులో వ్యవహారం నడుస్తోంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఏపీలో ఉన్న టికెట్‌ రేట్లు, షేర్స్‌, కలెక్షన్స్‌ గురించి తెలుసుకోకుండా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు?
ఆయన వ్యాఖ్యల వల్ల మిగిలిన సినిమాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆయన ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వాన్ని అవమాన పరిచేలా మాట్లాడకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇప్పుడున్న రేట్లతో ఆయన సినిమాకు ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయమే వస్తుందని నా అభిప్రాయం’’ అని నట్టి కుమార్‌ వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE