Suryaa.co.in

Telangana

పాల్వంచలో విషాదం: ఇంట్లో గ్యాస్ లీకేజీ కుటుంబం సజీవదహనం

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పాత పాల్వంచ తూర్పు బజార్‌లో ఓ ఇంట్లో గ్యాస్‌ లీకేజీతో కుమార్తె సహా దంపతులు సజీవ దహనమయ్యారు.

తూర్పు బజార్‌కు చెందిన శ్రీలక్ష్మి, మండిగ నాగ రామకృష్ణ భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం వేకువజామున ఇంట్లో గ్యాస్ లీకవడంతో దంపతులు సహా ఒక చిన్నారి సజీవ దహనమయ్యారు. మంటలు అంటుకోవడంతో మరో కుమార్తె తీవ్రంగా గాయపడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారని పాల్వంచ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమెకు 80 శాతం గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు.

LEAVE A RESPONSE