-నారా చంద్రబాబు నాయుడు
ఆజాదీ అమృత్ 75వ వార్షికోత్సవం సందర్బంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ రూపొందించిన క్యాలెండర్ ను టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… దేశ స్వాత్రంత్య పోరాటంలో జరిగిన ముఖ్యఘట్టాలను, దేశ ప్రజల కోసం నాడు ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేసేలా ఈక్యాలెండర్ లో పొందుపరిచారు. స్వాతంత్ర్యం కోసం పోరాడినవారిని, దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకోవడం, భావితరాలకు తెలియజేయటం అందరి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు.