Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడను క్యాసినోల డెన్ గా మార్చారు:వర్ల రామయ్య

-తెలుగు సంస్కృతిని, సాంప్రదాయాలను వైసీపీ నేతలు మంటగలుపుతున్నారు – ఆలపాటి రాజా
-విషసంస్కృతిపై అవసరమైతే తెదేపా జాతీయ స్థాయిలో పోరాటం చేస్తుంది – కొల్లు రవీంధ్ర

వర్ల రామయ్య:
ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎక్కడ బయటపడుతాయో అని అడుగడుగున భయపడుతున్నది. డీజీపీ ప్రత్యర్ధి పార్టీలకు ఒక న్యాయం, అధికార పార్టీలకు ఒక న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పోలీసుశాఖ గతంలో ఎన్నడూ ఇలా వ్యవహరించిన పరిస్థితి లేదు. గుడివాడ క్యాసినోల డెన్ గా మారింది. ఇదే విషయాన్ని పత్రికలు, ప్రజలు గగ్గోలు పెడుతున్న విషయం అందరికీ తెలుసు. దీనిపై చట్టబద్దమైన విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ 17 వ తారీఖు నుంచి రోడ్లపైనే ఉంది. 17 వ తారీఖున ఎస్సీకి పిర్యాదు చేశాం. 20 వ తేదీన తెలుగుదేశం అధ్యక్షులు దీనిపై నిజనిర్ధారణ కమిటీ నియమించారు. అదేరోజున సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి నిజనిర్ధారణ కమిటీకి రక్షణ కల్పించాలని కోరాం. ఆరోజు గుడివాడ వెళ్లే దారి పొడవునా అనేక అడ్డంకులు కల్పించారు. పార్టీ ఆఫీసుపై, తెలుగుదేశం నాయకులపై వైసీపీ దాడి చేసినా పోలీసులు నిస్తేజంగా చూస్తూ ఉండిపోయారు. డీఐజీని కలవాలని అడిగితే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నానని అబద్దాలు చెప్పారు. అరెస్టైన తెలుగుదేశం నాయకులు బైలు తీసుకుని విజయవాడ చేరే సరికీ డీఐజీ గారు గుడివాడలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు ప్రభుత్వ పెద్దల నుంచి అబద్దాలు ఎలా ఆడాలో నేర్చుకున్నట్లున్నారు. క్యాసినో వ్యవహారంపై కలెక్టర్ ను సైతం కలవడం జరిగింది. డీజీపీ గారికి కూడా విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వారికి మెయిల్ చేశాం. కానీ, వారి నుంచి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. వినతిపత్రం ఇద్దామని వచ్చిన మమల్ని నడిరోడ్డుపైనే నిలిపేశారు. బారికేడ్లు పెట్టి ఆపేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం ఎన్నడూ చూడలేదు. ఆరుగురి కమిటీ మెంబర్లను అడ్డుకునేందకు వందల మంది పోలీసులను మోహరించారు. వినతిపత్నాన్ని డీజీ ఆపీసు తపాలా బాక్సులో వేసేందుకు కూడా అనుమతించలేదు. సవాంగ్ గారి నేతృత్వంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలి. పోలీసులు పోలీసు యాక్ట్ కాకుండా జగన్ రెడ్డి యాక్ట్ అమలు చేస్తున్నట్లున్నారు. టిడిపి వారు కాబట్టి పిర్యాదు తీసుకోం అనడం దుర్మార్గం. గతిలేని పరిస్థితిలో అడిషనల్ ఎస్పీ గంగాధర్ కి నడిరోడ్డుపైనే వినతిపత్రం ఇచ్చి వెనుదిరగాల్సిన పరిస్తితి వచ్చింది.

ఆలపాటి రాజా:
చట్టంముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతున్నా డీజీపీ గారు మాత్రం తెదేపా నిజనిర్ధారణ కమీటీని నడిరోడ్డులో నిలబెట్టి పక్షపాతంగా వ్యవహరించారు. తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాలకు నీళ్లొదిలి అర్ధనగ్న ప్రదర్శనలతో, అశ్లీల డ్యాన్సులతో జూద గృహాలను వైసీపీ నేతలు నడుపుతున్నారు. దీనిపై విచారించండి అని అడిగినా కళ్లున్న కబోదిల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ప్రభుత్వ తాబేదార్లుగా మారిపోయారు. ప్రజల్ని ఇబ్బంది పెడతూ, ప్రతిపక్షాల గొంతునొక్కుతూ ఉన్నారు. చట్టాన్ని నడిరోడ్డులోకి లాగినట్లుగా పోలీసుల వ్యవహారం ఉంది.

కొల్లు రవీంధ్ర:
విషసంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేసి దానిపై పిర్యాదు చేయడానికి డీజీపీ ఆపీసుకు వస్తే దళిత నాయకుడైన వర్ల రామయ్య ను నడిరోడ్డుపై నిలబెట్టడం దుర్మార్గం. ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయా? గుడివాడలో జరిగిన క్యాసినోలు తెలుగుజాతి ప్రతిష్టకే భగ్నం కలిగించే విధంగా ఉన్నాయి. సాక్షాత్తు వైసీపీ మంత్రి కొడాలి నాని అస్లీల నృత్యాలు జరిగాయని, డీఎస్పీ తో మాట్లాడి తానే ఆపించానని చెప్పినా ఈరోజు వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిజనిర్ధారణకు వెళ్లిన తెదేపా నాయకులపైనే దాడి చేస్తే వారిపైనే కేసులు కడుతారా? ఈ రాష్ట్రానికి 12 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడిపై బండ బూతులు తిట్టినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరు. తెదేపా నాయకులు బుద్దా వెంకన్నను అరెస్టు చేయడం దుర్మార్గం. పోలీసులు కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయడం లేదు? డా. అంబేడ్కర్ గారు ఇచ్చిన హక్కులను ఈ రాష్ట్రంలో కాలరాస్తున్నారు. ప్రజలు కట్టే పన్నులతో పోలీసులు జీతాలు తీసుకుంటున్నారని గుర్తించుకోవాలి. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. రాష్ట్రంలో మొదలైన విషసంస్కృతిపై అవసరమైతే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో కూడా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.కార్యక్రమంలో తెదేపా నాయకులు అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE