– పారిపోయేందుకు ప్రయత్నించిన స్మగ్లర్లు
– చేజింగ్ చేసి పట్టుకున్న పోలీసులు అభినందిస్తున్న స్థానికులు
నర్సీపట్నంలో గంజాయి ముఠా కారు భీభత్సం సృష్టించింది వెనుక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళుతూ అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ పది నిమిషాల పాటు పట్టణంలోని అబీద్ సెంటర్ నుంచి పెద బొడ్డేపల్లి మదుం వరకు అలజడి రేకిత్తించారు. వివరాలిలా ఉన్నాయి. ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసిన స్మగ్లర్లు కారులో మహారాష్ట్ర తీసుకెళ్లే క్రమంలో నర్సీపట్నం చేరుకున్నారు. తనిఖీలు జరగొచ్చనే కారణంతో వీరు కారును వేగంగా నడుపుతూ వెళ్తున్నారు. దీనిని గమనించిన నర్సీపట్నం ట్రాఫిక్ ఎస్.ఐ దివాకర్ తన బందోబస్తుతో కలిసి కారును వెంబడించారు.
పోలీసుల నుంచి బయటపడేందుకు కారును వేగంగా నడిపే క్రమంలో స్థానిక అబీద్ సెంటర్లో వృద్ధురాలికి స్వల్పంగా డాష్ ఇచ్చి, శ్రీకన్య సెంటర్లో ఏర్పాటు చేసిన బారీగేట్లను గుద్దుకుని, పెదబొడ్డపల్లి వైపు అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ వెళ్లారు. ముందు స్మగ్లర్లు, వారి వెంబడిస్తూ పోలీసులు ఒకదాని వెనుక
మరొకటి వెళుతూ సినిమాలో చేజింగ్ సీన్ ను తలపించారు. పోలీసులు కారును వెంబడిస్తుండటంతో పట్టుబడక తప్పదని గ్రహించిన స్మగ్లర్లు కారును వదిలి బొడ్డపల్లి వంతెన కింద కాలువలోకి దూకేశారు. అప్పటికే స్థానికులు పెద్ద ఎత్తున చేరడంతో పాటు పోలీసులు అంతా రావడంతో వారికి ఎటూ కదలకుండా పట్టుకున్నారు. పోలీసులు చేసిన చేజింగ్ ను చూసిన స్థానికులు అభినందిస్తున్నారు.
నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం..
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో ముఠా కారును ట్రాఫిక్ ఎస్సై, పోలీసులు గుర్తించి వారిని వెంబడించారు.గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో ముఠా కారును ట్రాఫిక్ ఎస్సై, పోలీసులు గుర్తించి వారిని వెంబడించారు. తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారు ఓ ఆటోని ఢీకొట్టింది. అనంతరం పోలీసులు వెంబడిస్తుండటంతో కొంతదూరం వెళ్లాక కారును విడిచిపెట్టేశారు.
ఆ తర్వాత ఇద్దరు నిందితులు సమీపంలోని పెదబొడ్డేపల్లి పెద్ద చెరువులో దూకేయగా.. మరో నిందితుడి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు చెరువును చుట్టుముట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి
తీసుకున్నారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టడంతో అతడు చిక్కాడు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల కారులో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.