Suryaa.co.in

Andhra Pradesh

ట్విటర్‌పై హైకోర్టు ఆగ్రహం

– విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారు?

అమరావతి: జడ్జిలపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం. చట్టాలు, కోర్టులను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిన హైకోర్ట్. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వచ్చే వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అభ్యంతరకర పోస్టుల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని ఈసందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని సీబీఐని ప్రశ్నించింది. అనంతరం విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

LEAVE A RESPONSE