– బీజేపీ పొలిటికల్ ఫీడ్ బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్
ఆర్థిక సర్వే పైన వ్యాఖ్యలు మరియు బడ్జెట్ 2022-23 అంచనా :
రాబోయే ఆర్థిక సంవత్సరం 2022-23 న 8% నుండి 8.50% మధ్య వృద్ధి రేటు లక్ష్యం గా ఆర్థిక సర్వే పేర్కొనడం వాస్తవికతకు దగ్గరగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2020-21 న 7.3% ప్రతికూల వృద్ధి నమోదు కాగా, ఆత్మనిర్భర భారత్ యోజన అమలు ద్వారా, దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 అనుకూల వృద్ధి రేటు 9.2% నమోదు కావడం శుభసూచకం.
కేంద్ర బడ్జెట్ 2022-23 లో ఉద్యోగ మరియు ఉపాధి కల్పన ధ్యేయంగా ఉత్పాదక తో కూడిన ఆస్తులు కల్పన కు అవకాశం ఉండే విధంగా, మూలధన వ్యయానికి ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చే ప్రధానమంత్రి గతి శక్తి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్, భారతమాల & సాగరమల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంటుంది. స్వయం సమృద్ధి కి తారక మంత్రం గా గత బడ్జెట్ లో పేర్కొన్న ఆత్మనిర్భర్ భారత్ భావన, ఈ బడ్జెట్ లో కూడా కొనసాగుతుందనే సంకేతాలు కనబడుతుంది.
సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు , సహకార వ్యవసాయ సంఘాలు & వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గ్రామీణాభివృద్ధి ప్రధానంగా ఉండవచ్చు.ఈ బడ్జెట్ ప్రాధాన్యత ప్రధాని మోడీ మార్క్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మరియు సబ్ కా విశ్వాస్ తప్పకుండా కనబడుతుందని ఆశించవచ్చు.
నా దృష్టిలో అధిగమించవలసిన ప్రతిబంధకాలు :
ద్రవ్యలభ్యత
రుణ లభ్యత
ఏజెన్సీల నుండి సకాలంలో ఆమోదాలు
ఈ అంశాల పైన ప్రభుత్వం యొక్క ప్రత్యేక దృష్టి ఆవశ్యం.