Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఉద్యమ కార్యాచరణ యథాతథం

– చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
– పీఆర్సీ సాధన సమితి

అమరావతి : ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని పీఆర్సీ సాధన సమితి నేతలు మండిపడ్డారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్లేనని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్‌ అన్నారు.

చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారన్నారు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు. చలో విజయవాడను విజయవంతం చేయాలని ఉద్యోగలకు సూచించారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను మానుకోవాలని కలెక్టర్లకు సూచించిన ఆయన..ఉద్యోగులను
emp-ttalks భయపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.ఉద్యోగ సంఘాలు ప్రతి అంశంపై ప్రభుత్వానికి సహకరించాయని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్థిక అంశాలపై స్లైడ్లు వేసి మమ్మల్ని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

“మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్లే. చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుంది. చలో విజయవాడను విజయవంతం చేయాలి. ఉద్యోగులను భయపెట్టవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలి. సమ్మె, ఆందోళన తాత్కాలికం.. మళ్లీ కలిసే పని చేయాలి.” అని బండి శ్రీనివాస్‌ అన్నారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్లు పదేపదే చెప్పామని బండి శ్రీనివాస్‌ అన్నారు. ఇవాళ్టి భేటీలోనూ పాత అంశాలపైనే మాట్లాడారన్నారు.

తాము చెప్పిన 3 అంశాలపై తేల్చాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తాము చెప్పిన అంశాల పరిష్కారం సాధ్యపడదని మంత్రుల కమిటీ చెప్పిందని అన్నారు. జీతాలు పెరిగాయనడం మోసం చేయడమే..
వేతన సవరణను ప్రభుత్వం ప్రహసనంలా మార్చిందని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ అన్నారు. నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని మంత్రుల కమిటీని కోరినట్లు వెల్లడించారు. బలవంతంగా కొత్త జీతాలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. డీఏ బకాయిలతో జీతాలు పెరిగాయనడం మోసం చేయటమేనని అన్నారు. తమ డిమాండ్లు అసంబద్ధమైనవని సజ్జల సమాచారం పంపినట్లు వెల్లడించారు.

“వేతన సవరణను ప్రభుత్వం ప్రహసనంలా మార్చింది. నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని కోరాం. బలవంతంగా కొత్త జీతాలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. డీఏ బకాయిలతో జీతాలు పెరిగాయనడం మోసం చేయడమే. మా డిమాండ్లు అసంబద్ధమైనవని సజ్జల సమాచారం పంపారు.” అని సూర్యనారాయణ, ఉద్యోగ సంఘం నేత అన్నారు.

డీడీవోలను బెదిరించి కొత్త జీతాలు వేశారు. డీడీవోలను బెదిరించి కొత్త జీతాలు వేశారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. పీఆర్సీ నివేదిక చాలా ముఖ్యమని మంత్రుల కమిటీకి చెప్పినట్లు తెలిపారు. నివేదికపై ప్రభుత్వ కమిటీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదన్నారు.యథావిధిగా చలో విజయవాడ కార్యక్రమమం నిర్వహిస్తామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE