నిర్మలంగా ‘వాతా’రామన్…

132

అంకెలే తప్ప లంకెల బిందెలు లేవే…
మొత్తమంతా ప్రైవేటుకు లెవీనే…

ఎంపీలంతా శ్రోతలు కాగా….
నిర్మలా ‘వాత’రామన్..
కనిపించని దెబ్బలు…

రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగానికి మరిన్ని బొబ్బలు…!

స్వతంత్ర భారత చరిత్రలో
ఇందిరమ్మ తర్వాత
బడ్జెట్ ఇచ్చిన రెండో మహిళ
ఈసారి చేసిన ప్రసంగం
హిందోళంలో…
జనం మాత్రం గందరగోళంలో…!

ఆవిష్కరిస్తూ రుణభారతం అంతర్లీనంగా ప్రై’వేటు’ బాగోతం…

దేశ భవిత గుట్టును…
బిజెపి ఎక్కబోయే గట్టుని

చెప్పకనే చెబుతూ నిర్మలమ్మ
విపక్షాలకు తాపిస్తూ
మంచి నీళ్ళు…నిర్మలంగా..!

ఇంతకీ ఏముంది అక్కడ…
కప్పల తక్కెడ…
ఎక్కడ పెంచారో…
ఎలా ముంచారో…
తెలియని తెర…
ప్రభుత్వ రంగానికి కత్తెర!
చెప్పింది కనిపించదు…
కనిపించింది అర్థం కాదు…

అటూ ఇటూ కాని అవగతం ఘనమైనది మన గతం
అబ్బో…అదేగా మోడీజీ మనోగతం!

చెప్పాలనుకుంటే పేరడీ…
అంకెల గారడీ…
రాష్ట్రాలకు కేటాయింపుల తాయిలాలు…

రానున్న ఎన్నికల కోసం ముందే కూసిన కోయిలలు…

– నాగేష్ & రవీంద్ర