– కేసీఆర్ వ్యాఖ్యల్ని జగన్ ఎందుకు ఖండించలేదు?
– మాజీ మంత్రి కె. ఎస్. జవహర్
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అని కేసీఆర్ మాట్లాడటం రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్ తో పాటు దేశ ప్రజలను అవమానించటమే. దేశంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకనుగుణంగా నాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. 75 ఏళ్ల నుంచి ప్రజల హక్కుల్ని, స్వేచ్చను కాపాడుతూ వస్తున్న రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం సరికాదు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.
కేసీఆర్ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు ఖండించలేదు? జగన్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తున్నారా? దేశంలో రాజ్యాంగాన్ని మారిస్తే..ఏపీలో చట్టబద్దంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారా? కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ తక్షణమే స్పందించాలి.