Suryaa.co.in

Andhra Pradesh

గ్రామాల్లో జగనన్న విద్యుత్ కోతల పథకం

-వైసీపీ నాయకులు జే ట్యాక్స్ తో కలకలలాడుతుంటే… కరెంట్ లేక ప్రజలు మగ్గిపోతున్నారు
-ఒకప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తే నేడు కరెంట్ కోసం ఎదరు చూపులు
-ఏలూరి సాంబశివరావు

విద్యుత్ రంగంలో ఈ ఏడాది బ్రహ్మంఢంగా వర్షాలు పడి నీరు సమృద్ధిగా ఉన్నాయి. బొగ్గు కొరత ఎక్కడా లేకపోయినా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు అన్ని గ్రామాల్లో అప్రకటితంగా కరెంట్ కోతలు పెడుతున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తరువాత జగనన్న విద్యుత్ కోతల పథకం పెట్టారు. సమర్ధవంతమైన పాలన లేకపోవడం వలన కమీషన్ల కక్కుర్తి కోసం వ్యవస్థలన్నింటిని అస్థవ్యస్థం చేస్తున్నారు. విభజన తరువాత 22మిలియన్ యూనిట్ల లోటు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో సర్ ప్లస్ చేసి ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ సప్లై అందించారు. 9,529 మె.గా వాట్ల ఉత్పత్తి సామర్ధ్యం నుంచి 19,080 మె.గా. వాట్ల ఉత్తత్తి సామర్ధ్యం పెంచి ఘనత టీడీపీకే దక్కుతుంది. కాని నేడు జగన్ రెడ్డి చేతగాతనంలో విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చారు. 6 సార్లు విద్యుత్ పెంచి రూ.30వేల కోట్ల భారం ప్రజలపై వేశారు. నేడు కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుంది తెలియని పరిస్థితి. పంట చేతికి వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా అస్థవ్యస్థం కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులకు కనీసం ఇస్తానన్న 9 గంటల కరెంట్ సక్రమంగా ఇవ్వకపోగా మోటర్లకు మీటర్లు పెట్టి వేల కోట్ల భారం వేస్తున్నారు. డిస్కమ్ ల పేరుతో రూ.6వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చి వాటిని దారి మళ్లించారు. ఒక సమర్ధవంతమైన పరిపాలన నుంచి పగ్గాలు చేపట్టిన జగన్ రెడ్డి అసమర్ధంతో, చేతివాటంతో విద్యుత్ వ్యవస్థను బ్రష్టుపట్టించారు.

పీపీఏల ద్వారా రూ.3 కన్నా తక్కువగా దొరుకుతున్న విద్యుత్ ను పీపీఏలు రద్దు చేయడం ద్వారా రూ.14 నుంచి రూ. 17 వరకు డిమాండ్ హవర్స్ లో కొనడం అవినీతికి ఆస్కారం కలిగించే విధంగా ఉంది. టీడీపీ హయాం 5 ఏళ్లల్లో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదు. అదే విధంగా భవిష్యత్ లో విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. దాని కోసం ముందు చూపుతో సోలార్, విండ్ పవర్లతో పాటు అన్ని ప్రత్యామ్నాయలను ఉపయోగించారు. కాని జగన్ రెడ్డి మాత్రం నగరాల్లో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి ముందుగానే కరెంట్ బిల్లులు వసూళ్లు చేసే స్థాయికి దిగజార్చారు.

ఏపీలో 27,310 మె.గా. వాట్ల సామర్ధ్యం ఉంటే… 30వేల మిలియన్ యూనిట్లు మాత్రమే ప్రొడక్షన్ చేస్తున్నారు. తెలంగాణలో 14,408 మె.గా. వాట్ల సామర్ధ్యం ఉంటే… 30,091వేల మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఓరిస్సాలో 12,258 మె.గా. వాట్ల సామర్ధ్యం ఉంటే 35,578 మిలియన్ యూనిట్ల ప్రొడక్షన్ చేస్తున్నారు. చత్తీస్ ఘడ్ 24,659 మె.గా వాట్ల సామర్ధ్యం ఉంటే 73,084 యూనిట్ల ప్రొడక్షన్ చేస్తున్నారు. విభజన తరువాత తెలంగాణ సర్ ప్లస్ లోకి వస్తే ఏపీ సర్ ప్లస్ నుంచి డెఫ్ షీట్ లోకి ఎందుకు పడిపోయాం. దానిని జగన్ రెడ్డి అసమర్ధత కాదా?

నేడు జగన్ రెడ్డి చర్యలకు ప్రజల్లో బాధకలుగుతుంది. పనులు చేసుకొని ఇంటికి వచ్చే సరికి కరెంట్ లేకపోతే ఎలా? జగన్ రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమే కరెంట్ కోతలు. ఒక సమర్ధుడు సర్ ప్లస్ పవర్ ను క్రియేట్ చేస్తే ఒక అసమర్ధుడు పవర్ షార్టేజ్ ను క్రియేట్ చేశాడు. అది జగన్ రెడ్డి రివర్స్ పాలనలో విద్యుత్ రంగానికి జరుగుతున్న నష్టం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జే ట్యాక్స్ తో కలకలలాడుతుంటే… కరెంట్ లేక ప్రజలు మగ్గిపోతున్నారు. ప్రజలు ఒకప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తే నేడు కరెంట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. జగన్ రెడ్డి ఇప్పటికైనా కళ్లె తెరిచి మీ అవినీతిని పక్కన పెట్టి విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాలి.

ప్రకాశం జిల్లాలో ఎన్ఎస్పీ ఆయకట్టు కింద ఖరీఫ్ లో పంటలు దెబ్బతిన్నాయి.. తరువాత కొద్ది పాటి నీటితో అవకాశాలను ఉపయోగించి మొక్కజొన్న వంటి పంటలు సాగు చేశారు. నేడు అవ్వన్ని కోత కొచ్చే పరిస్థితి ఉంది. నేడు వాటికి నీటి అవసరం ఉంది. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఏ మేజర్ కు పూర్తి సామర్ధ్యంతో నీరందడం లేదు. కేవలం ప్రభుత్వం మానిటరింగ్ లేకపోవడం వలన ఈ నష్టం జరుగుతుంది. మరమ్మతులకు నిధులు కేటాయించడం లేదు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాగం ప్రకాశం జిల్లా రైతాంగాన్ని కాపాడాలి. లేదంటే వేల కోట్లు రైతాంగాం నష్టపోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే రైతులకు ఎరువులు దొరకని పరిస్థితి. ప్రకృతి వైపరిత్యాల వలన నష్టం జరిగితే రైతు అర్ధం చేసుకుంటారు కాని జగన్ రెడ్డి అసమర్ధతతో రైతుకు నష్టం జరిగితే ఊరుకునే పరిస్థితి ఉండదు. మీ చర్యలకు తప్పకుండా తిరగబడతారు.

ప్రభుత్వ నిర్వాకం వలన ఒక్క గింజ చేతికి వచ్చే పరిస్థితి. పాలనను గాలికి వదిలేసి బాధ్యతారాహిత్యంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సమస్యలు వస్తే పట్టించుకోవడం లేదు. కనీసం రివ్యూలు పెట్టిన ధాఖలాలు లేవు. గ్రామాల్లో ట్రాన్స్ ఫార్మర్ లకు ఎటూ కరెంట్ రాదని చిన్న పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు వోల్టేజ్ సమస్యను ఎక్కడికక్కడ అరికట్టి ప్రతి ఏడాది లక్ష వరకు వ్యవసాయ కనెక్షన్ లు ఇస్తే నేడు జగన్ రెడ్డి ఒక్క వ్యవసాయ కనెక్షన్ ఇచ్చిన ధాఖలాలు కనపడటం లేదు. రైతులతో బలవంతంగా సంతకాలు పెట్టించికొని మోటర్లకు మీటర్లు పెట్టించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో దేశంలో మొట్ట మొదటి సారిగా 24/7 విద్యుత్ నుఅందిస్తే నేడు కనీసం రోజుకు 3 గంటలైనా కరెంట్ ఇవ్వటం లేదు. చంద్రబాబు నాయుడు రాకముందు ప్రతి ఇంట్లోను ఇన్వెటర్లు ఉండేవి ఆ తరువాత ఏడాదంతా నాణ్యమైన కరెంట్ ఇవ్వడంతో వాటికి అంతగా పని ఉండేది కాదు. పరిశ్రమలు తరలివచ్చాయి. కాని నేడు జగన్ రెడ్డి చేతగాని పాలన వలన మళ్లీ ఇన్వెర్టర్లు, జనరేటర్లు వచ్చాయి. పైపెచ్చు పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. భవిష్యతో ఇంకా దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. గ్రామాల్లో కరెంట్ లేకపోవడంతో ప్రజలు మానసికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు.

LEAVE A RESPONSE