పుట్టిన రోజు నాడే పాడే ఎక్కిన ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువకులు.మా పిల్లలు మత్తులోనే చనిపోయారని స్వయంగా తల్లిదండ్రులే బాధని వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ల ఆవేదనని అర్థం చేసుకోవచ్చు.టోల్ గేటు దగ్గర వందల కేజీల కొద్దీ గంజాయి పట్టుకొని జబ్బలు చారచట్టమే గాని ఈ గంజాయి మత్తులో ఎంత మంది యువత బలి అవుతుందో అంచనా వేయలేని అధికారులు.కృష్ణాయ్యపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.పెనుమాకకు చెందిన వారిగా గుర్తింపు.కాసు సతీష్ రెడ్డి, షేక్ కబర్, షేక్ రాజు వీరు ముగ్గురి వయసు 18 నుంచి 19 సంవత్సరాలు.పుట్టినరోజు వేడుకలు చేసుకొని, అతిగా మద్యం సేవించి కెటిఎమ్ బైక్ పై ఓవర్ స్పీడ్ తో కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి.ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను లను మార్చురీకి తరలించి విచారణ చేపట్టిన మంగళగిరి రూరల్ పోలీసులు.
Devotional
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు?? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం…
Sports
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్‌లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…
చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్
భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం…