-ఏపీకి సీఎం లేడని చెప్పడం ఎంత అసహజమో.. రాజధాని లేదనడం అంతే అసహజం
– బీజేపీ నేత లంకా దినకర్
ఇప్పుడు ఏపీ కి ముఖ్యమంత్రి లేడు అని చెప్పడం ఏంత అసహజమో రాష్ట్రానికి రాజధాని లేదనడం అంతే అసహజం. భారతదేశ చిత్రపటం లో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు అని నాల్గో తరగతి పుస్తకాలలో ముద్రించడం అవమానకరం.
జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రామాణికం, దాన్ని కూడా తొక్కిపట్టి పిల్లల మనస్సులో విషబీజం వేస్తున్నారు. పార్లమెంట్ లో కేంద్ర డిప్యూటీ హోమ్ మంత్రి నిత్యానందరాయ్ సమాదానం ఇస్తూ అమరావతి ఆంద్రప్రదేశ్ రాజధాని అని ప్రకటించిన సంగతి మరచారు.
ఇది ముమ్మాటికి కావాలని చేసిన దుర్మార్గం, దీనికి విద్యాశాఖ మంత్రి మరియు అధికారులు భాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే, అమరావతి, విశాఖ, కర్నూలు మరియు హైదరాబాద్ అని చూపడం ప్రభుత్వ తీరు ఏంత అయోమయంగా ఉందో అర్థం అవుతుంది.అమరావతి స్మార్ట్ సిటీ క్రింద కేంద్ర ప్రభుత్వం 21 ప్రాజెక్టుల కోసం 2046 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది శూన్యం.