-లోకేష్ వ్యంగ్యాస్త్రం
ఖాళీ కుర్చీలకి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకూ వెళ్లాలా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు? పైగా జగన్ గురించి పెద్దగా ఇక్కడ ఎవరికి తెలియదని సెలవివ్వడం మీ స్పీచ్ కే హైలెట్! చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇలా అంతర్జాతీయ స్థాయి లో ఎపి పరువు గంగలో కలిసిపోయింది. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకెలాగో చేతకాదు కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే పదివేలు.