– బీజేపీ నేత లంకా దినకర్ డిమాండ్
దేశంలో కిలో రూ.40 మార్కెట్ లో అమ్మే బియ్యం రూ.25 కి ఎగుమతి చేయడం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే సాధ్యం. 2019 నుండి గత మూడు సంవత్సరాల్లో దాదాపు 10 వేల కోట్లు విలువైన పేదల బియ్యాన్ని మెక్కిన పంది కొక్కులు ఎవరో సీబీఐ దర్యాప్తులో బయటపడాలి. కేంద్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా 22 వేల కోట్లు ఆహార సబ్సిడీ ఇస్తే, రాష్ట్రంలో మాత్రం పేదల పొట్ట కొట్టే పాలన సాగుతుంది. పేదల బియ్యం ఖండాంతరాలు దాటి వెళ్ళాక, ఇప్పుడు అధికారుల హడావుడి వల్ల లాభం ఏంటీ ?