Suryaa.co.in

Telangana

మహిళలపై దాడులు చేయాలని కొత్త రాజ్యాంగం రాస్తారా?

– తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తరిమే రోజు త్వరలోనే వస్తుంది
– టిఆర్ఎస్ గూండాలను బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయాలి
– బిజెపి రాష్ట్ర మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి

ప్రముఖ న్యాయవాది బిజెపి నాయకురాలు ప్రసన్నపై కొంతమంది టీఆర్ ఎస్ గుండాలు మల్కాజి గిరి కోర్టులో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కోర్టు ఆవరణలో మహిళపై దాడి చేయడం టీఆర్ ఎస్ పార్టీ నైజాన్ని తెలియజేస్తోంది. టీఆర్ ఎస్ పార్టీ పతనమవుతున్న దృష్ట్యా దాడులతో లొంగదీసుకోవాలని అనుకోవడం సరికాదు. టీఆర్ ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై రాజ్యాంగంపై విశ్వాసం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. టీఆర్ ఎస్ నాయకులు దాడులు చేసినా, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. దాడులు చేసిన టీఆర్ ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయకుండా బాధితులపై కూడా దుర్మార్గంగా కేసులు నమోదు చేసి బాధిస్తున్నారు.

కెసిఆర్ కొత్త రాజ్యాంగం రాయాలి అని అన్నారు మహిళలపై దాడులు చేయాలని రాస్తారా? దౌర్జన్యాలతో అక్రమాలతో టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తరిమే రోజు త్వరలోనే వస్తుంది. దాడులకు పాల్పడిన టిఆర్ఎస్ పార్టీకి చెందిన న్యాయవాది ముసుగులో ఉన్న టిఆర్ఎస్ గూండాలను బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయాలి. వెంటనే దాడి చేసిన టీఆర్ ఎస్ గుండాలను అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE