-ముఖ్యమంత్రి ఎన్నిప్రయత్నాలు చేసినా అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను ఆపలేరు
• తన బాబాయ్ ని ఎవరుచంపారో జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసి, నాటకాలు ఆడుతున్నారు
• ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను అడ్డుకుంటున్నారా?
• పిల్లి కళ్లుమూసుకొని పాలుతాగుతూ, ఎవరికీ ఏమీ తెలియదులే అన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉంది
• అవినాశ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయండి.. హత్యతో ప్రమేయమున్న పెద్దతలకాయల ఆటకట్టించండని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సీబీఐని ఎందుకు ఆదేశించడంలేదు?
• వివేకాహత్యకేసులో తనప్రమేయంలేదని, అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను తాను ఆపడంలేదని ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటనచేయాలి
– – టీడీపీజాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులోని సాక్ష్యాలన్నీకూడా వై.ఎస్. అవినాశ్ రెడ్డి నేత్రత్వంలోనే హత్యజరిగినట్లుగా చూపిస్తు న్నాకూడా ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారని, ఆయన అరెస్ట్ కు ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డే అడ్డుపడుతున్నారా అని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య ప్రశ్నించారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
వివేకానందరెడ్డి హత్యజరిగిననాటినుంచీ జగన్మోహన్ రెడ్డి వ్యవహ రిస్తున్న తీరు, వ్యవహారశైలి అంతా అనుమానాస్పదంగానేఉంది. హత్యజరిగిననాడు మీడియాతో మాట్లాడింది మొదలు, తరువాత గవర్నర్ వద్దకు వెళ్లి సీబీఐ విచారణ జరపాలనికోరడం, హైకోర్ట్ లో సీబీఐవిచారణకోరూతూ పిటిషన్ వేయడం, ముఖ్యమంత్రి అయ్యా క తిరిగి దాన్ని వెనక్కుతీసుకోవడం, హైకోర్ట్ సీబీఐవిచారణకు ఆదే శించాకకూడా కేసుగురించి తనకేమీ సంబంధంలేదన్నట్లుగా వ్యవ హరించడం, ముఖ్యమంత్రి అయ్యాక హత్యకేసుని విచారిస్తున్న సిట్ పరిధిని తగ్గించడం వంటిచర్యలన్నీ ఆయనపై పలు అనుమా నాలు కలుగచేస్తున్నాయి.
తనబాబాయ్ ని చంపింది ఎవరో ము ఖ్యమంత్రికి ముందే తెలుసు. కాబట్టే ఆయన ఇన్నినాటకాలు ఆడారని తాము అంటాము. హత్యజరిగిననాడే ఎంపీ అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి మొత్తం చెప్పేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డే ఇప్పటికీ ఏమీతెలియనట్లుగా నటిస్తున్నారు. తనబాబాయ్ ని చంపినవారెవరో తెలుసుకోవాలన్న ఆలోచన గౌరవముఖ్యమంత్రికి ఎందుకుకలగడంలేదని ప్రశ్నిస్తున్నాం.
తాడేపల్లి రాజప్రాసాదం అనుమతి లేకుండా ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ తనను వేధిస్తోందంటూ కోర్టులో పిటిషన్ వేయగలడా? ఆ వ్యవహారంపై ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు? వివేకాహత్యకేసులో ఇన్నిసాక్ష్యాలు కళ్లముందుకని పిస్తున్నా, అన్నీ అవినాశ్ రెడ్డి పాత్రను ధృవీకరిస్తున్నా, అతన్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నది జగన్మోహన్ రెడ్డికాదా?
స్టూవర్ట్ పురం దొంగలుపట్టుబడగానే, వారిఇళ్లలోని వారు జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఇతరత్రా విభాగాలకు టెలి గ్రామ్ లుపంపించేవారు. అదేవిధంగా వివేకాహత్యకేసులో నింది తులను అరెస్ట్ చేయగానే, వారికి సంబంధించిన వారితో కేసులు పెట్టిస్తున్నారు. శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేయగానే అతనిభార్యతో కేసుపెట్టిస్తారా? ఇదంతాచూస్తుంటే పకడ్బందీగా ఒకపథకంప్రకా రం క్రిమినల్ గ్యాంగ్ చేస్తున్నట్లుగా ఉందిగానీ, నేరాలతో సంబంధం లేని వ్యక్తులుచేస్తున్న చర్యల్లా కనిపించడంలేదు. నేరాల్లో ఆరితేరి న బృందంలోని వారే ఇదంతాచేస్తున్నారు.
తనబాబాయ్ ని చంపినవారెవరో ముమ్మాటికీ ముఖ్యమంత్రికి తెలుసు..తెలుసు అని అంటున్నాం. పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగుతున్నట్లుగా రాష్ట్రప్రజలు ఎవరూ తనచర్యలను పట్టించుకోవ డంలేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వివేకాహత్యకావింపబడ టానికి ప్రధానకారకుడు అవినాశ్ రెడ్డేననిరాష్ట్రమంతా అనుకుంటు న్నారు. 2019 మార్చి 15నవివేకానందరెడ్డి హత్యజరిగితే, 17వ తేదీన కడపఎంపీ టిక్కెట్ ను జగన్మోహన్ రెడ్డి అవినాశ్ రెడ్డికి డిక్లే ర్ చేశారు. బాబాయ్ ని తనకంటితో పోల్చి గతంలో రెండుకళ్ల సిద్ధాంతాన్ని ఉటంకించిన జగన్మోహన్ రెడ్డి, రెండోకన్ను అవినాశ్ రెడ్డని చెప్పదలుచుకున్నారా? అదేనా ఆయనగతంలోచెప్పిన రెండు కళ్లసిద్ధాంతం.
నిజంగా జగన్మోహన్ రెడ్డికి వివేకాపై ప్రేమాభి మానాలే ఉంటే, ఆయన మరణించగానే కడపఎంపీ టిక్కెట్ ను వారి కుటుంబసభ్యులకు ఎందుకివ్వలేదు? ఇలాంటి అనేక ప్రశ్న లకు సమాధానం తెలియాలంటే ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే. రాజకోటరహస్యాన్ని బయటపెట్టాల్సిన ఏకైకవ్యక్తి జగన్మోహన్ రెడ్డే నని తేల్చిచెబుతున్నాం.
రాజకోట నుంచి సందేశంరాకుండా విచారణచేస్తున్న సీబీఐ అధికా రిపైకేసులుపెట్టడం ఎక్కడైనా జరిగిందా? అలానే అప్రూవర్ గా మారినవ్యక్తి నోరెత్తకుండా ఉంటే 20ఎకరాలపొలం, కావాల్సినంత డబ్బు ఇస్తామనిచెప్పడం ఏమిటి? ఇవన్నీ అనుభవజ్ఞులైన నేరగా ళ్లు మాత్రమేచేయగలిగినవి. వివేకాహత్యకేసులో అసలు దోషుల ను ముఖ్యమంత్రే రక్షిస్తున్నారని రాష్ట్రమంతా అనుకుంటోంది. కాబట్టి, అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను తానుఆపడంలేదని, వివేకాహత్య లో తనప్రమేయం లేదని ముఖ్యమంత్రి తక్షణమే ఒకప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
వివేకాహత్యోదంతం సీరియల్ అయిపోయింది. సాక్షిపత్రిక, న్యూస్ ఛానల్లో ఎప్పుడు దీనిగురిం చే. సాక్షిపత్రికను కూడా సీబీఐవిచారించాలి. హత్యజరిగనరోజు సాక్షి టీవీలో, పత్రికలో గుండెపోటు అనిరాశారు..అలా ఎవరు చెబితే రాశారో సీబీఐ తేల్చాలి. ముఖ్యమంత్రి ఎన్నిఅడ్డంకులు సృష్టించినా, వివేకాహత్యకేసులో అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఆపలేరని స్పష్టంచేస్తున్నాం.