Suryaa.co.in

Political News

భారత్‌పై విషం చిమ్మిన ఉక్రెయిన్‌కు ఎందుకు మద్దతివ్వాలి?

– భారత్ తటస్థ వైఖరినే అవలంబించాలి
– సంబంధం లేని యుద్ధంలో మనమెందుకు తలదూర్చాలి?

ఎలా మరిచిపోతాం ? మనముకూడా మనుషులమే కదా!
ఒక్కసారి చరిత్ర గమనిస్తే, ఉక్రెయిన్ భారతదేశానికి ఎప్పుడూ వ్యతిరేకంగానే పనిచేసింది. కింద కొన్ని ప్రూఫ్ లు కూడా పెట్టాను మీకోసం.
ఐక్యరాజ్య సమితిలో కాశ్మీరు అంశంపై భారతదేశానికి వ్యతిరేకంగా, పాక్ కి అనుకూలంగా ఉక్రెయిన్ ఓటువేసింది.
1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షలను ఉక్రెయిన్ వ్యతిరేకించింది.
అణు పరీక్షలను అడ్డుపెట్టి భారత్ పై ఆంక్షలు విధించిన వాటిలో ఉక్రెయిన్ కూడా ఒకటి.
భారత్ కి శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా లకి T-80 యుద్ధ ట్యాంకులను, ఆయుధాలను అమ్మింది.
పాక్,చైనాలకి ఆయుధాల సరఫరాని కనీసం తగ్గించమని భారత్ అడిగినా ఉక్రెయిన్ స్పందించలేదు.
తమ ఆయుధ వ్యాపారం కోసం అమెరికా,యూరోప్, నాటోదేశాలే ఉక్రెయిన్ ని రష్యా పైకి ఎగదోసాయి. వాళ్ళెవ్వరూ నేరుగా ఉక్రెయిన్ కి అండగా నిలబడేందుకు సిద్దంగాలేరు. అలాంటిది మనకి అసలు సంబంధం లేని యుద్ధం లో మనమెందుకు తలదూర్చాలి?
మనకి ఏనాడూ మద్దతుగా నిలవని ఉక్రెయిన్, ఇప్పుడు మద్దతు కోరడం హాస్యాస్పదం. భారత్ తటస్థ వైఖరినే అవలంబించాలి. అదే మనకి మంచిది.
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)

– అనిల్ రఘు

LEAVE A RESPONSE