సంపూర్ణమైన మానసిక,శారీరక ఆరోగ్యంతో వందేళ్లకు పైగా జీవించారు.
‘శతం మానం భవతి’ ఆశీర్వాదాన్ని అధికంగా అందిపుచ్చుకొని 102 ఏళ్ళు పరిపూర్ణంగా ఈ భూమిపై నడయాడిన విశేష జన్మ వారిది.రాజకీయాలు కూడా ఆరోగ్యంగానే చేశారు. షుగర్,బిపి వంటివి ఆ శరీరాన్ని అంటలేదు.ఆయనను తాకే ధైర్యం ఏ వ్యాధీ
చెయ్యలేదు.స్వతంత్ర,కాంగ్రెస్,తెలుగుదేశం మూడు పార్టీల్లోనూ స్వతంత్రంగానే మెలిగారు.సాత్వికుడు, వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్నారు.
ఆచార్య ఎన్ జి రంగాగారి ప్రేరణతో రాజకీయాల్లోకి ప్రవేశించి ఆయన పేరు నిలబెట్టిన నేత.
సాత్వికుడే కానీ!
తన అభిప్రాయాలను,
అభ్యంతరాలను నిక్కచ్చిగా వెల్లడించేవారు.
మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి.నిద్రలేవడం మొదలు నడక,నడత,ఆహారం,
వ్యవహారం,విరామం,విశ్రాంతి వరకూ అన్నింటా ఆ క్రమశిక్షణ కొట్టొచ్చినట్టు కనిపించేది.
తాతముత్తాతల నుంచి వచ్చిన జన్యుపరమైన (genetic) లక్షణాలు,స్వయం క్రమశిక్షణ, యోగం అన్నీ ఆయనకు కలిసి
వచ్చాయి.తెల్లని శరీరంతో,తెల్లని వస్త్రాల్లో,అంతకంటే తెల్లని చిరునవ్వుతో నూరేళ్లకు పైగా జీవించి,నవ్వుతూ తనువు చాలించిన యోగపురుషుడు.
ఇటువంటివారి జీవనశైలిని నేటి తరం నాయకులు కొందరైనా ఆచరిస్తే?! రాజకీయాలు,సమాజం,దేశం ఆరోగ్యంగా మనగలుగుతాయి.
– దారపనేని నరేంద్రబాబు