-డిప్యూటీ స్పీకర్ పద్మారావు
త్వరలో తుకారంగాట్ ఆర్ యుబి ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఉప సభాపతి పద్మారావు తెలిపారు. సోమవారం ఆయన అధికారులతో కలసి తుకారాం గేట్ ఆర్ యూ బి పనులను పరిశీలించారు. అనేక సవత్త్వసరాలుగా పనులను పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అనేక
సంవత్సరాలుగా ఇక్కడి రైల్వే గేట్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. బల్దియా, రైల్వే అధికారులు సమన్వయంతో ఆర్ యూ బి పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.
వంతెన నిర్మాణం వల్ల ప్రధానంగా సికింద్రాబాద్, మల్కాజిగిరి, కంటోన్మెంట్ తదితర నియోజకవర్గంలో ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. పద్మారావు వెంట కార్పొటర్ లింగాని ప్రసన్న లక్మి శ్రీనివాస్, టీఆర్ఎస్ యువజన నాయకులు కిశోర్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.