డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తరచుగా… చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత లేదు, నాకు ఉంది. అని చెప్పుకునేవారు.దానికి తగ్గట్టే, రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ మాట్లాడే వాళ్లు.అదే సమయంలో… చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే వాళ్లలో, చంద్రబాబు గురించి పాజిటివ్ గా మాట్లాడిన విషయాలు పెద్దగా బయటకు వచ్చేవి కాదు. కానీ విమర్శిస్తూ మాట్లాడిన మాటలు, చాలా ఉండేవి.
రాజకీయాలలో సమకాలికులైన వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడికి గత పాతిక, ముప్పై సంవత్సరాలలో అత్యంత సన్నిహితంగా మెలిగిన కొద్ది మందిని తీసుకుంటే…చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళు ఎవరూ రాజశేఖర్ రెడ్డికి కానీ, జగన్ కి కానీ సన్నిహితులు కాలేదు.
కానీ వైయస్ మరణానంతరం…వైయస్ కు అత్యంత సన్నిహితులు అనుకునేవాళ్ళు… చంద్రబాబు నాయుడుని కలిసి, అత్యంత ఆత్మీయంగా మాట్లాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.వైయస్ కు జీవితకాలం గత సహాయకుడిగా పనిచేసిన సూరీడు, వైయస్ రాజకీయ ఆలోచనా విధానానికి గొంతుకగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ అభిమానిగా, అంతరంగికుడుగా, న్యాయ సలహా దారుడుగా
పని చేసిన జంధ్యాల రవిశంకర్……. వీళ్లందరి కన్నా…. కీలకంగా చెప్పుకోదగిన…. వైయస్సార్ స్వయంగా తన ఆత్మ అని ప్రకటించుకున్న కే.వి.పి రామచంద్ర రావు… గత 12 ఏళ్లలో కలిసిన ప్రతి సందర్భంలో, చంద్రబాబు నాయుడుతో ఆత్మీయంగా, అత్యంత స్నేహపూర్వకంగా, మనసు విప్పి మాట్లాడుకోవడం… మీడియా సాక్షిగా మనం చూశాం.
అయితే నాకు అర్థం కానిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు విశ్వసనీయత గురించి, చంద్రబాబు నాయుడులోని మానవతా కోణం గురించి తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పాల్సినంతగా చెప్పకపోవడం.మరీ ముఖ్యంగా, రాజశేఖర్ రెడ్డి మరణాంతరం…. విలువలు, విశ్వసనీయత అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన రాజకీయ, అధికార కాంక్షకు కుటుంబ విలువలను కూడా బలి చేస్తున్న ప్రస్తుత సందర్భంలో….. రాజకీయ ప్రత్యర్థుల పట్ల కూడా, మానవతా దృక్పథంతో ఆలోచించే చంద్రబాబు నాయుడు గురించి….. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడకపోతే… ఇంకెవరు మాట్లాడుతారు?
యడ్లపాటి వెంకట్రావు గారి ఇంటిదగ్గర చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నప్పుడు… కెవిపి ముఖంలో కనిపించిన సంతోషాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది…. అందరికీ చెప్పాలని రాశాను.
