Home » కొత్తపల్లి వల్ల నాకు ఒరిగిందేమీ లేదు

కొత్తపల్లి వల్ల నాకు ఒరిగిందేమీ లేదు

– అధికార పార్టీ నేత అయి ఉండి జిల్లా కేంద్రం సాకుతో నాపై బురద జల్లుతున్నారు
– ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు

ఏలూరు : గడిచిన ఎన్నికల్లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వల్ల నాకు ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు.పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా నరసాపురంను ప్రకటించాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు, అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఉద్యమం పేరుతో తనను లక్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారని, నియోజకవర్గ ప్రజలకు తానేంటో తెలుసునని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు స్పష్టంచేశారు.

ఈ మేరకు గురువారం నర్సాపురం లో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసిన ప్రతిపక్షాలు విమర్శించడం సహజమన్నారు కానీ అధికార పార్టీకి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటువంటి విమర్శలు చేయటం తగదన్నారు. సుమారు 30 రోజులుగా ఉద్యమం జరుగుతున్న కొత్తపల్లి సుబ్బారాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను ఎందుకు తీసుకు వెళ్లలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

జిల్లా కేంద్రంగా నర్సాపురం చేయాలని తాను చేయని ప్రయత్నం అంటూ లేదు అన్నారు.జిల్లా కలెక్టర్, ప్రణాళిక విభాగం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలను కలిసి నివేదిక సమర్పించామని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా ఈ విషయాలు గమనిస్తున్నారని తెలిపారు. నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని అన్నారు. తనను స్థానికేతరుడని కొంతమంది చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.

నరసాపురం నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు తానేంటో తన నిజాయితీ ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో రాజంపేట,హిందూపురం, అరకు,నరసాపురంలను మాత్రమే జిల్లా కేంద్రాలుగా చేయలేదన్నారు. వీటి సాధన కోసం పార్టీపరంగా ఎమ్మెల్యేగా తాను నిరంతరం కృషి చేస్తున్నానన్నారు . రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు. తాను ఎవరినీ బెదిరించి అంత పెద్ద వ్యక్తిని కాదన్నారు.

తన గెలుపు కోసం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేసిందేమీ లేదన్నారు.గడిచిన ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన అనంతరం మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బర్రె జయరాజు,మైల వీర్రాజు లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అన్నారు. గతంలో తాను సుబ్బారాయుడు పై 17,500 మెజారిటీతో గెలిచాను అన్నారు. గడిచిన్న ఎన్నికలలో తాను కేవలం 6,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించానని దీనిని బట్టి ప్రజలు అర్థం చేసుకోగలరని ఆయన అన్నారు. జిల్లాకేంద్ర సాధన కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అన్నారు.

ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కొలబత్తుల రవికుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరమణ, వైస్ చైర్ పర్సన్ కామన నాగిని, వైఎస్ఆర్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పి డి రాజు, జిల్లా మత్స్యకార సంఘాల అధ్యక్షులు చల్లా రావు, నర్సాపురం కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ షేక్ మస్తాన్, బర్రె శంకర్, పార్టీ సీనియర్ నాయకుడు చాగంటి సత్యనారాయణ, ఏడిద కోట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు జయ, పార్టీ మండల అధ్యక్షుడు దొంగ మురళి, జే వి ఆర్, జడ్పీటీసీలు బొక్క రాధాకృష్ణ, బాబ్జి ,కామన బాల సత్యనారాయణ, కావాలి నాని, కడలి రాంబాబు, పలువురు వైయస్సార్ సిపి కౌన్సిలర్లు, సర్పంచులు,ఎంపీటీసీలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply