– బాబే మద్యం తాపించి ఆ పార్టీ నేతల చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు
– టీడీపీ ఆఫీసు, కరకట్ట ఇల్లు టీడీపీ నాయకులకు బార్ లా మారాయి.
– అధికారంకోసం బాబు ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు.. ఎన్ని అడ్డగోలు రాతలైనా రాయిస్తాడు
– టీడీపీ కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాలో చంద్రబాబు ట్రైనింగ్ ఇస్తున్నాడు.
– బూతుల సంస్కృతిని వీడకపోతే మహిళలే చీపుర్లతో తరిమి కొడతారు
– దొంగ ఏడుపులు ఏడ్చి అసెంబ్లీ నుంచి పారిపోవడం కాదు, చేతనైతే చర్చించండి
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్
ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
ఆరిపోయే దీపంలా రాష్ట్రంలో టీడీపీ
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు.. ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న టీడీపీ, రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోవటానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నింటా విఫలమై, రాబోయే రెండేళ్ళలో రాజకీయాలు వదిలి, ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే నిన్న చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా సమావేశం పెట్టి, టీడీపీ ఇంకా బతికే ఉంది, చచ్చిపోలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. తప్ప తాగి వాగే నాయకులంతా తట్టా బుట్ట సర్దుకొని పారిపోబోతున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని నారా చంద్రబాబు అండ్ కో..ను హెచ్చరిస్తున్నాం.
గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ఏ విధంగా చంద్రబాబు అండ్ కో దోచుకుతిన్నారో రాష్ట్ర ప్రజలు అనుభవ పూర్వకంగా చవిచూశారు. టీడీపీని అధికారంలోకి తెస్తే.. మళ్ళీ టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి, దోచుకోవడానికి, వారి ఆదాయ మార్గాలు పెంచేందుకు, ప్రభుత్వ పథకాలను స్కాములుగా ఎలా చేయాలోనని చంద్రబాబునాయుడు వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎంతసేపటికీ మళ్ళీ అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఎలా దోచుకోవాలి.. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎలా దోచి పెట్టాలనే చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. మీరు దోచుకోవడానికి ఇంకా ఇక్కడ ఏం మిగిలాయ్, మీరు అధికారంలో ఉండగా, అన్నీ దోచుకుని వెళ్ళారుగా.. పైగా, రాష్ట్రం నెత్తి మీద లక్షల కోట్లు అప్పులు పెట్టి వెళ్ళావు కదా చంద్రబాబూ..!
చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా, తల్లకిందులుగా తపస్సు చేసినా, చేసిన తప్పులకు చెంపలేసుకుని, పొర్లు దండాలు పెట్టినా.. రాజకీయ నయ వంచకుడైన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరుగాక నమ్మరు. రాజకీయాల్లో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ప్రజలను వంచించేందుకు ఎంతకైనా తెగిస్తాడని, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాడు, తన ఎల్లో మీడియాలో ఎన్ని విధాలుగా అయినా అడ్డగోలు రాతలు రాయిస్తాడని ప్రజలు గమనించారు కాబట్టే.. 2019 ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీని, తనకు వత్తాసు పలికే ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బతికించుకోవాలని చూస్తున్నాడు. చంద్రబాబు కథేంటో, ఆ ఎల్లో మీడియా కథేంటో ప్రజలకు బాగా తెలుసు.
బూతుల సంస్కృతిని బాబు పెంచిపోషిస్తున్నాడు
తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బాగా కొవ్వు పట్టిన పట్టాభి రెండురోజులుగా ముఖ్యమంత్రిపైన, మా పార్టీ నాయకులపైనా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు. ఇటువంటి బూతుల సంస్కృతిని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పెంచి పోషిస్తున్నాడు. మీరు ప్రజలకు ఏం మంచి చేశారని మీకు ప్రజలు ఓటేస్తారు, మీకు సీట్లు ఇస్తారు..?. అధికారంలో ఉండగా, ఈ రాష్ట్రాన్ని దోచుకుతిన్నదీ, భ్రష్టుపట్టించిందీ ఇంకా చాల్లేదని మీకు ఓట్లేస్తారా..?. టీడీపీ హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను అసలు మనుషులుగా చూశారా..?. వారిని మీ కాళ్ళ చెప్పుల కింద ఉండేలా, ఎంతగా అవమానించారు, ఎంత దారుణంగా చూశారు మీరు. మీ పరిపాలనలో అణగదొక్కబడిన వర్గాలన్నీ… ఈరోజు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో.. ఇది మా ప్రభుత్వం అని గర్వంగా తలెత్తుకుని బతుకుతున్నారు. దరిద్రమైన బూతుల సంస్కృతిని మీరు వీడకపోతే.. ఆంధ్రప్రదేశ్ లోని మహిళలే మిమ్మల్ని చీపుర్లతో తరిమి తరిమి కొడతారు.
బాబే మద్యం తాపించి ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు
మా నాయకులను బూతులు తిట్టించేందుకు చంద్రబాబే దగ్గరుండి మద్యం తాపించి, ఆ పార్టీ నాయకులను మీడియా ముందుకు పంపిస్తున్నాడు. దాంతో ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్నపాత్రుడు, పట్టాభి లాంటి వాళ్ళు బాబు దగ్గర మార్కులు పొందేందుకు వినటానికి కూడా వీల్లేని బూతులు, వల్గర్ భాష మాట్లాడుతున్నారు. ఇదేనా చంద్రబాబు 40 ఏళ్ళ అనుభవం అని ప్రశ్నిస్తున్నాం. మీకు 160 సీట్లు వచ్చే సంగతి దేవుడెరుగు.. అసలు నీవు గెలుస్తావా అచ్చెన్నాయుడు… కుప్పంలో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గెలుస్తాడా.. ? ఎంతసేపటికీ వారి కాళ్ళు, వీరి కాళ్ళు పట్టుకుని, పొత్తులు పెట్టుకుని ముందుకు వెళదామనే ఆలోచనే తప్ప సొంతంగా పోటీ చేసి గెలుద్దామనే ఆలోచనే మీకు లేదు. అలాంటి మీరు ఎక్కడ గెలుస్తారు, ఎప్పుడు గెలుస్తారు..?. మరోవైపు పొద్దున లేస్తే మద్యం తాగకుండా పళ్ళు కూడా తోముకోని అయ్యన్నపాత్రుడు.. ఎంతసేపటికీ తాగి వాగుదామనే ఆలోచనతోనే ఉంటాడు. కార్పోరేటర్ స్థాయి కూడా లేని పట్టాభికి, చంద్రబాబు నాయుడే దగ్గర ఉండి మద్యం తాపించి మీడియా ముందు మొరగమని వదులుతున్నాడు. దాంతో టీడీపీ ఆఫీసు, కరకట్ట ఇల్లు టీడీపీ నాయకులకు బార్ లా తయారైంది. మీకు ఏం పోయే కాలం వచ్చింది బాబూ…?.
ప్రతిపక్షం పనికిరానిపక్షంగా మారింది
రాష్ట్రంలో ప్రతిపక్షం పనికిరాని పక్షంగా, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పనికిరాని నాయకుడుగా మారాడు. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా జగన్ గారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు అటు సంక్షేమంలోనూ, అభివృద్ధి లోనూ, రాజకీయ పదవులలోనూ పెద్ద పీట వేసి, గౌరవిస్తుంటే, ఆ వర్గాలన్నీ సంతోషంగా ఉంటే మీకు ఎందుకు కడుపు మంట అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ళు పేదలు కట్టుకుంటుంటే.. మీరు చూడలేరు. లోకేష్ బుద్ధీ జ్ఞానం లేకుండా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని నిన్న మంగళగిరిలో మాట్లాడుతున్నాడు. మీ కళ్ళకు కనిపించకపోతే.. ఎక్కడెక్కడ ఇళ్ళు నిర్మిస్తున్నామో, అవి కాలనీలుగా ఎలా తయారవుతున్నాయో చూపించడానికి నేను సిద్ధం.
దొంగ ఏడుపులు ఏడ్చి అసెంబ్లీ నుంచి పారిపోయారు
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే.. దొంగ ఏడుపులు ఏడ్చి పారిపోతారు. చేతనైతే, అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే.. వాటి మీద చర్చించండి అంటే, అది మీకు చేతకాదు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగుతోంది, నవరత్నాలతో సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అమలవుతున్నాయి. ఒక్క బటన్ నొక్కగానే డీబీటీ ద్వారా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బులు వెళుతున్నాయి. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, చేదోడు.. తదితర పథకాలన్నీ చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్ కు అందేలా, దేశంలో ఎక్కడా అమలుకాని విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
మీ వర్గమే బాగుండాలి, బతకాలంటే ఎలా..?
తమ వర్గమే, తమ కులమే, తమ వాళ్ళు మాత్రమే బతకాలి, తాము మాత్రమే బాగుపడాలన్నదే చంద్రబాబు ధ్యాసంతా. మీరు కాకుండా, రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఎస్సీలు గురించి, వారు బాగా బతకాలని ఏనాడైనా ఆలోచించావా చంద్రబాబూ..?. ఈరోజు సామాజిక న్యాయం జగన్ మోహన్ రెడ్డి ద్వారానే జరిగిందని అందరూ సంతోషిస్తుంటే.. వాళ్ళను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. సీనియర్ జర్నలిస్టుగా, వ్యాపారవేత్తగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిగారిని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడతారా..?. చంద్రబాబును మేము తిట్టలేమా.. మాకు నోరు లేదా..? సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, మీరు మాట్లాడే బూతులు మేము మాట్లడటం లేదు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తుంటే.. బాబు తన వర్గం మాత్రమే బాగుండాలనేలా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. జగన్ ఒక ధీరుడు.. ఆయన ఎప్పటికీ పులిలానే ఉంటాడు తప్పితే… చంద్రబాబులా అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం కాదు. జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఏ విధంగానూ సాటి రాలేడు, రాడు కూడా. 2024లోనూ చంద్రబాబుకు మరలా ఘోర పరాభవం తప్పదు.