– ముఖ్యమంత్రి నిర్ణయాలతో అభివృద్ది పధంలో రాష్ట్రం, ప్రశంసించిన మహరాష్ట్ర బృందం
-నాడు నేడుతో మార్కట్ యార్డులకు కొత్తరూపు
-జగన్ తోనే జనం, మాటలు గారడీతో జనాన్ని మార్చలేరు
– తండ్రినేర్పిన విధ్యతో ఇతరులను నిందించడం తప్ప లోకేష్ కు ఏం తెలుసు?
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
ఏపీలో ఏర్పాటు చేసిన వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు విప్లవాత్మకమని మహారాష్ట్ర అధికారుల బృందం ప్రశంసించిందని రాజ్యసభ సభ్యలు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ట్విట్టర్, ఇతర సామాజిక మాద్యమాల వేదికగా పలు అంశాలపై స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా ఉందని బృందం కొనయాడిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటకు దీటుగా తీర్చిదిద్దడం అభినందనీయమని బృందం కితాబిచ్చిందని పేర్కొన్నారు.
చిత్రగుప్తుడి ‘హార్డ్ డిస్క్’ అంతా చంద్రబాబు పాపాల చిట్టాతో ఏనాడో నిండిపోయిందన్నారు. దశాబ్దాలుగా వీరు చేసిన అరాచకాలు, కిరాతకాలు లెక్కకు కూడా చిక్కడంలేదని, సుపారీ హత్యల సంస్కృతి వారిదేనని
అన్నారు. పెనుకొండ నుంచి మచిలీపట్నం దాకా చేయించిన హత్యల ఉసురు తగలకుండా తప్పించుకోలేరని అన్నారు.
పెన్షన్లు, అమ్మ ఒడి లబ్దిదారులకు అన్యాయంగా నిధులు నిలిపేసారని తెలిస్తే వివరాలు బయటపెట్టాలని, తద్వారా ప్రజలకు మేలు చేసిన వాడివి అవుతావని లోకేష్ కు సవాల్ విసిరారు. అబద్ధాల తుంపర్లు వెదజల్లడం తప్ప సంక్షేమం గురించి ఎం తెలుసని, తండ్రి నేర్పిన విద్యతో గుడ్డ కాల్చి మొహం మీద విసరడం మాత్రమే తాను నేర్చుకున్నడని అన్నారు.
మార్కెట్ యార్డులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయని, నాడు -నేడు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని అన్నారు. రూ.249.87 కోట్లతో 589 పనులను ప్రారంభించిందని అన్నారు. గతేడాది జూలై 8న రైతు దినోత్సవం ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టిన ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. 14 మార్కెట్ కమిటీలకు నూతన భవనాలు నిర్మాణం జరుగుతుందని, 137 మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదేనని చంద్రబాబుకు, ఆయనకు ఊడిగం చేస్తున్న ‘అదృశ్య శక్తులకు అర్థం కావడంలేదని అన్నారు. చుట్టపు చూపుగా వచ్చిపోయే తండ్రీకొడుకులు (లోకేష్ చంద్రబాబు), ఆస్థాన జ్యోతిష్యులు, మాటల గారడీలతో జనాన్ని ఏమార్చలేరని, జనం జగన్ తోనే ఉన్నారని అన్నారు. దేహమంతా వ్యాపించిన వ్యాధి పైపూతతో నయం కాదని అన్నారు.