Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగులు, యువకుల ఆగ్రహానికి బలికాక తప్పదు

-2.30లక్షల ఉద్యోగాలతో ప్రకటన విడుదలచేయకుంటే, నిరుద్యోగులు, యువకుల ఆగ్రహానికి బలికాక తప్పదు
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరి

నాడు అధికారంకోసం 2.30లక్షల ఉద్యోగాలిస్తాననిచెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడు అసెంబ్లీలో కేవలం 60వేల ఖాళీలే ఉన్నాయని చెప్పడం దుర్మార్గం. గతంలో ఇచ్చిన హామీప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి 90వేలఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలచేస్తే, ఏపీముఖ్యమంత్రి మాత్రం తనమద్యం వ్యాపా రాన్నిపెంచుకుంటూ, 90ఎమ్.ఎల్.సీసాలకు యువతను, నిరుద్యోగులను బలిచేస్తున్నాడని టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంచౌదరి ఎద్దేవా చేశారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

విజయవాడ ధర్నాచౌక్ లో నేడుజరిగిన నిరుద్యోగ, యవజన,విద్యార్థి సంఘాల ఉద్యమాన్ని ముఖ్యమంత్రి పోలీసుబలగాన్ని ఉపయోగించి అణచివేయడాన్ని, యువ నేతల అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాదాపుగా 175మంది వరకు యువజనేతలను అరెస్ట్ చేశారు. నిరుద్యో గులు, యువత ఆశలు, ఆకాంక్షలకువ్యతిరేకంగా పనిచేస్తు న్న ప్రభుత్వంపై నిరసనతెలిపే హక్కు నిరుద్యోగులకు, యు వకులకు లేదా?

జగన్ రెడ్డి పాదయాత్రసమయంలోఇచ్చిన హామీని అమలుచేయాలనికోరడమే వారుచేసినతప్పా? రాష్ట్రంలోని నిరుద్యోగులనుచూసి జాలిపడాలో.. సిగ్గుపడాలో … తెలియడంలేదు. ఒక అథముడికి అధికారమిస్తే ఏంజరు గుతుందో చెప్పడానికి నిరుద్యోగులవెతలే నిదర్శనం. జగన్ రెడ్డి పాదయాత్రసమయంలో ఇచ్చిన హామీపై నిరుద్యోగులు ప్రశ్నిస్తుండటంతో ముఖ్యమంత్రిలోచలిజ్వరం మొదలైంది.

పాదయాత్రసమయంలో జగన్ రెడ్డి 2.30లక్షల ఉద్యోగఖాళీ లు ఉన్నట్టుచెప్పి, తాను ముఖ్యమంత్రి అయినవెంటనే వా టన్నింటినీ భర్తీచేస్తానని చెప్పాడు. ఏటామెగా డీఎస్సీ నిర్వ హణతోపాటు, జాబ్ క్యాలెండర్ విడుదలచేస్తానని నిరుద్యో గులు యువతనునమ్మించాడు. ముఖ్యమంత్రి అయి మూడేళ్లు అయినా 2.30లక్షలఉద్యోగాలు భర్తీచేయని జగన్ రెడ్డి, తీరాఇప్పుడు అసెంబ్లీలో రాష్ట్రంలోకేవలం 60వేల ఉద్యో గ ఖాళీలేఉన్నాయనిచెప్పడం నిరుద్యోగులను వంచించడం కాదా? ఉద్యోగాలసంఖ్య ఒక్కసారిగా ఎందుకు తగ్గిందో అసెంబ్లీసాక్షిగా ముఖ్యమంత్రి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలోని నిరుద్యోగ, విద్యార్థిసంఘాల తరుపున ముఖ్యమంత్రిచేసిన మోసంపై ప్రశ్నిస్తున్నాం. ఒక్కఛాన్స్ అని, నేనుఉన్నాను..నేను విన్నాను.. అన్నొస్తున్నాడు ..యువతను ఉద్దరిస్తాడనిచెప్పి అధికారం లోకి వచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి కాగానే నిరుద్యోగులు యువకుల జీవితాల్లోచీకట్లు నింపాడు. ఒక అహంకారికి, ఒక సైకోకి, ఒకఅవినీతిపరుడికి, ఒక అరాచకవాదికి, ఒక దొంగనునమ్మి ఎందుకుమోసపోయామా అని నేడు నిరుద్యో గులు, యువకులు లబోదిబోమంటున్నారు.

చంద్రబాబునాయుడి హయాంలో 5.13లక్షలఉద్యోగాలు ఇచ్చారు. అలానే మరో15లక్షలకోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ఒప్పందాలుచేసుకున్నారు. ఆ ఒప్పందాలన్నీ అమల్లోకి వచ్చిఉంటే ఇప్పుడు యువతకు 30లక్షలనుంచి 40లక్షలవరకు ఉద్యోగాలు వచ్చేవి. కానీ జగన్ రెడ్డి ముఖ్య మంత్రిఅయ్యాక గతప్రభుత్వంలో ఒప్పందాలుచేసుకున్న పారిశ్రామికవేత్తలంతా పొరుగురాష్ట్రాలకు వలసపోయారు. అందుకుకారణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిఅయ్యాక సాగించిన అరాచకమే.

2018 లెక్కల ప్రకారం, టీడీపీప్రభుత్వంలో ఉద్యోగఉపాధి అవకాశాలకల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలిస్థానంలోఉంటే, నేడు 7వస్థానానికి దిగజారింది. టీడీపీహాయాంలో నిరుద్యోగ యువత నిరాశానిస్పృహలకులోనుకాకుండా ఉండాలనే సదుద్దేశంతో చంద్రబాబుగారునిరుద్యోగ భృతి అమలుచేస్తే, జగన్ రెడ్డి అధికారంలోకివచ్చాక దాన్ని తొలగించాడు. నిరు ద్యోగ భృతిలేక, ఉద్యోగాలు లభించక యువతపరిస్థితి రెండిం టికీ చెడ్డరేవడిలా మారింది. జగన్మోహన్ రెడ్డి మూడేళ్లపాలన లో 353మందినిరుద్యోగులు చనిపోయారు.

రాష్ట్రంలోని నిరు ద్యోగులఆకలికేకలు, వారికఆత్మహత్యలు జగన్ రెడ్డికి వినిపించకపోవడం .. కనిపించకపోవడం దారుణం. జగన్ రెడ్డి ఇప్పటికైనా యువతను, నిరుద్యోగులనువంచించే కబు ర్లుచెప్పడం మానేసి, వారికిన్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు, యువ కులు ఉద్యోగాలుఎప్పుడొస్తాయా అని కళ్లుకాసేలా ఎదురు చూస్తున్నారు.

జగన్ రెడ్డి గతంలోచెప్పినవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే .2.30లక్షలఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలచేయాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి తక్షణమే తమడిమాండ్లపై స్పందించకపోతే, నిరుద్యోగ, యువజన సంఘాలను కలుపుకొని జగన్ రెడ్డి ఆటకట్టిస్తామని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE