ఒక బ్రాహ్మణుడు మేకను పట్టుకుని పోతుంటే, నలుగురు దొంగలు ఒక చోట చేరి, బ్రాహ్మణుడి దగ్గర మేకను చేజిక్కించుకోవటానికి పధకం పన్ని , దారిలో తలా ఒక చోట నిలబడి, బ్రాహ్మణుడి ని కుక్క ని పట్టకుపోతున్నారు ఎందుకు అని ఒక చోట మొదటి దొంగ అంటాడు.బ్రాహ్మణుడు పట్టించుకోడు.
బ్రాహ్మణుడు మరలా కొంత దూరం వెళ్ళాక రెండో దొంగ బ్రాహ్మణుడిని మొదటి దొంగ అన్న మాటే అంటాడు. బ్రాహ్మణుడు మేకను పట్టుకుని కొంత దూరం వెళ్ళాక,మూడో దొంగ రెండో దొంగ అన్న మాటే
అంటాడు.మరలా బ్రాహ్మణుడు ఆలోచనతో మేకను పట్టుకుని కొంత దూరం వెళ్ళాక మూడో దొంగ అన్న మాటే నాలుగో దొంగ అంటాడు..మరలా బ్రాహ్మణుడు ఆలోచన వదిలేసి, నాలుగో దొంగ కు మేకను ఇచ్చిపోతాడు.
అంటే నలుగురు దొంగలు కలిసి మేకను కుక్క ను చేసారు. బ్రాహ్మణుడు నమ్మి మోసపోయాడు.అలాగే మోసాలను నలుగురు కలసి నిజాలుగా చెబుతారు. ప్రజలు నమ్మి మోస పోవద్దు.( ఏపీ సీఎం జగన్ మూడేళ్ల పాలన సందర్భంగా ఓ జ్ఞాపకం)
– రామ్మోహన్