జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నాదెండ్ల మనోహర్ ప్రసంగం :
సభా వేదకకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాం.దామోదరం సంజీవయ్య పేద ఎస్సీ కుటుంబం నుంచి వచ్చారు.దామోదరం సంజీవయ్య గురించి ఏ పార్టీ నాయకుడూ మాట్లాడట్లేదు.పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలకు గురయ్యారు.పవన్ ను ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.పవన్ తెలుగు ప్రజల కోసం ఎవరినైనా ఎదుర్కొంటానని అన్నారు.సంక్షేమం పేరుతో విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు.రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నారు.. భూకబ్జాలు చేస్తున్నారు.చెరువులు తవ్వేస్తున్నారు.. నదీ పరివాహక ప్రాంతాలు ఆక్రమిస్తున్నారు.జనసేన సభా ఏర్పాట్లకు రైతులు సహకరించారు.రైతులు సొంతంగా ట్రాక్టర్లపై వచ్చి సభకు సహకరించారు.
అమరావతిని నాశనం చేశారు.. 9 అంతస్తుల భవనం ఖాళీగా పడి ఉంది .అమరావతిలో ఒకప్పుడు 8 కోట్లు పలికిన భూమి.. ఇప్పుడు 3 కోట్లకు పడిపోయింది.అమరావతి నాశనానికి జగన్ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు.అమరావతి మహిళలు ఇప్పటం సభకు తరలివచ్చారు.30-40 శాతం మందికే సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.సంక్షేమం పేరుతో ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోంది.మన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవాలి.ఎందరో నాయకులు పార్టీ వదిలివెళ్లినా కార్యకర్తలు, మహిళలు పార్టీని నిలబెట్టారు.జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం బలపడింది.గ్రామగ్రామాన పార్టీ సభ్యత్వం పెరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారు.పార్టీ సభ్యత్వ నమోదుకు ఊహించని స్పందన వచ్చింది .పార్టీ క్రియాశీల సభ్యులే బూత్ ఏజెంట్లుగా పనిచేయాల్సి ఉంటుంది .క్రియాశీల సభ్యులకు శిక్షణ తరగతులు ఉంటాయి.అస్త్ర యాప్ ను పార్టీ కోసం సిద్ధం చేశాం.ప్రతి జనసైనికుడు మన కుటుంబంలో భాగమే.ఇతర రాష్ట్రాల నుంచి కూడా సభకు తరలివచ్చారు.మూడేళ్లలో జగన్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?
23 వేల ఉద్యోగాలకు కోటి 45 లక్షల మంది పోటీపడుతున్నారు .జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్ మోసం చేశారు .మనది అహంకారం.. ఆత్మగౌరవానికి మధ్య పోరాటం .పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయి.యువత, మహిళలు, అన్నదాతల కోసమే మన పార్టీ.
గత ఎన్నికల్లో జీతాలు ఇచ్చి మరీ మనపై దుష్ప్రచారం చేశారు.ఇప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు.మన పార్టీపై దుష్ప్రచారం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.సీఎం తీరుతో పారిశ్రామికవేత్తల పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు.ఎమ్మెల్యేలే రౌడీలుగా మారి కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు.మనం ఈరోజు నుంచే ఎన్నికలకు సిద్దం కావాలి.జగన్ ను ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఓడించాలి.మనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోయినా జనం కోసం మనం పోరాడుతాం.పవన్ సభకు సహకరించిన పోలీసుశాఖకు కృతజ్ఞతలు.