Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ కాలకేయులు మహిళలు, చిన్నారుల మానప్రాణాలు హరిస్తున్నారు

– జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళాసంక్షేమం, భద్రత గాల్లో దీపంగా మారాయి.
• వైసీపీ నేత వేధింపులకు బలైన నాగలక్ష్మి, బోయపాలెంలో అధికారపార్టీ నేత కుమారుడి దాష్టీకాలకు గురైన అంగన్ వాడీ ఆయాల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏం న్యాయంచేస్తాడో చెప్పాలి?
• మహిళాశిశుసంక్షేమశాఖా మంత్రి ఏనాడైనా అంగన్ వాడీ కేంద్రాల దుస్థితిగురించి ఆలోచించారా?
• సరైన ఆహారంలేక, నాసిరకం పదార్థాలు తిని పేదపిల్లలు ఆసుపత్రులపాలవుతుంటే మహిళాశిశు సంక్షేమశాఖా మంత్రి, ముఖ్యమంత్రి భజనలో మునిగితేలుతున్నారు.
• హోంమంత్రేమో ప్రభుత్వపెద్దలచేతిలో రబ్బర్ స్టాంప్ లా మారిపోయి, రాష్ట్రంలో లేని దిశ చట్టంతో ఉరిశిక్షలు, యావజ్జీవశిక్షలు వేశామంటూ డబ్బాలుకొట్టుకుంటున్నారు.
– టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

పేదబిడ్డల ఆకలితీరుస్తూ, వారిఆలనాపాలనకోసం వారిపాలిటతల్లు లుగా మారిన అంగన్ వాడీలకు ఈ ముఖ్యమంత్రి పాలన శాపంగా మారిందని టీడీపీ అంగన్ వాడీ విభాగం రాష్ట్రఅధ్యక్షురాలు ఆచంటసునీత వాపోయారు.శుక్రవారం ఆమె మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆమె మాటల్లోనే …

పాదయాత్రలో, ఎన్నికలమేనిఫెస్టోలో అంగన్ వాడీల డిమాండ్లన్నీ నెరవేర్చి, వారుకోరినవిధంగా జీతాలు పెంచుతామ న్న జగన్మోహన్ రెడ్డి, తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వారిపై పోలీసుజులం ప్రయోగించి నోరెత్తకుండా చేస్తున్నాడు. ఆఖ రికి ఈప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోకూడా అంగన్ వాడీల జీతభత్యాలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు చేయకపోవ డం దురదృష్టకరం.అంగన్ వాడీలు వారిన్యాయమైన డిమాండ్ల కోసం రోడ్లపైకిరావడం, కలెక్టరేట్ల ముట్టడికి పాల్పడటం చేస్తుంటే, వారిని పోలీసులసాయంతో ఈముఖ్యమంత్రి దారుణంగా హింసిస్తు న్నాడు. మహిళాపక్షపాతినని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏవర్గం మహిళలు అయినా సంతోషంగా ఉన్నారా?

అంగన్ వాడీల్లో పేదపిల్లలకు పెట్టే భోజనంలోకూడా అవినీతికి పాల్పడుతున్న ఈప్రభుత్వతీరుతో పేదకుటుంబాల చిన్నారులు ఆకలితో అలమటించే దుస్థితి ఏర్పడింది. నాసిరకమైన కోడిగుడ్లు, నాణ్యతలేనిపాలతో పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్మోహన్ రెడ్డికి వారిఉసురుతప్పకుండా తగులుతుంది.అంగన్ వాడీకేంద్రాల దుస్థితి, అక్కడపనిచేసేవారి పరిస్థితిఎలా ఉందో తెలుసుకోకుండా మహిళాశిశుసంక్షేమశాఖామంత్రి పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు.

అంగన్ వాడీ వర్కర్లకు చంద్రబాబు అసలు రూపాయికూడా జీతంపెంచలేదని మంత్రిచెప్పడం, ఆమెలోని అజ్ఞానానికి సంకేతం. మహిళామంత్రులుగా ఉన్నవారంతా వారి సంక్షేమంపై చూపుతున్న శ్రద్ధలో సగంకూడా మహిళలుచిన్నారుల వెతలపై చూపడం లేదు. అంగన్ వాడీకేంద్రాల్లోని ఆహారంతిని పలుచోట్ల చిన్నారులు అస్వస్థతకుగురై ఆసుపత్రులపాలైనా కూడా ఏనాడూ ఏఒక్క మహిళామంత్రికూడా ఆచిన్నారులవద్దకువెళ్లడం, వారికుటుంబ సభ్యులతో మాట్లాడటంగానీచేయలేదు. కనీసంచిన్నారుల అస్వస్థ తకు కారణమైన ఏఒక్క అంగన్ వాడీకేంద్రాన్ని అయినా మహిళా శిశుసంక్షేమశాఖామంత్రిగారు సందర్శించారా అనిప్రశ్నిస్తున్నాం.

అంగన్ వాడీ వ్యవస్థను పటిష్టంచేసి, ఆయాకేంద్రాల్లో పనిచేసే వారికి ఉద్యోగభద్రతకల్పించి, వారిజీవితాల్లో వెలుగులు నింపింది చంద్రబాబుగారు.. టీడీపీప్రభుత్వాలే. అంగన్ వాడీవ్యవస్థకు సంబంధించిన వాస్తవాలేకాదు… రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు ఎలాంటిభద్రతలేదనే పచ్చినిజంకూడా తెలియని స్థితిలో మహిళాశిశుసంక్షేమమంత్రి ఉండటం నిజంగా ఈరాష్ట్ర మహిళలు, చిన్నారుల దౌర్భాగ్యమనేచెప్పాలి.

యథాలీడర్ తథా క్యాడర్ అన్నట్టే జగన్మోహన్ రెడ్డి బాటలోనే ఆయనపరివారమంతా నడుస్తోంది.
యడ్లపాడు మండలంలోని బోయపాలెంలో బతుకుతెరువుకోసం అంగన్ వాడీకేంద్రంలో ఆయాగాపనిచేస్తున్న మహిళను స్థానికవైసీపీనేత కుమారుడు ప్రలోభపెట్టిఆమెపై బెదిరింపులకుపాల్పడింది నిజంకాదా? ఇలా అంగన్ వాడీకేంద్రాలకు సరైన ఆహారపదార్థాలుసరఫరాచేయలేని ప్రభుత్వం, ఆఖరికి ఆయాకేంద్రాల్లో పనిచేసేవారిపై లైంగికవేధింపు లకు పాల్పడటాన్నిఏమనాలి?

వైసీపీ అంటేనే కామాంధులు, కాలకేయులకు కేరాఫ్ అని ప్రజలం తా అనుకుంటున్నారు.అలాంటి కామాంధులు, కాలకేయులకు ఈ ముఖ్యమంత్రి రక్షణగానిలుస్తూ, రాష్ట్రంలోని ఆడబిడ్డలు, చిన్నారుల జీవితాలను బలితీసుకుంటున్నాడు. వీవోఏగా పని చేస్తున్న నాగలక్ష్మి అనేమహిళను మంత్రిపేర్నినాని అనుచరుడైన నరసింగరావు ఎన్నోరోజులనుంచీ ఇబ్బందులకు గురిచేస్తున్నా.. ఆమె గతంలోనే ఎస్పీకిఫిర్యాదుచేసినా ఈప్రభుత్వం పట్టించుకోలేదు.

స్థానికవైసీపీనేత వేధింపులు తట్టుకోలేక ఆఖరికి మంత్రిపేర్ని నానీ నియోజకవర్గంలోని మహిళ ఆత్మహత్యకుపాల్పడింది. సినిమాటిక్కెట్లపై, చంద్రబాబుపై, లోకేశ్ పై ఇష్టానుసారం మాట్లాడే పేర్నినానీ తననియోజకవర్గంలోతన అనుచరుడి వేధింపులు తట్టుకోలేక ఒకమహిళచనిపోతే దానిపైమంత్రి ఏంసమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. నిజంగా ఈ ముఖ్యమంత్రికి, ఆయన మంత్రులకు మహిళలపై ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా… తక్షణమే రాష్ట్రంలోని మహిళలభద్రతపై దృష్టిపెట్టి, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో అసలుపోలీస్ వ్యవస్థ ఉందా అనేఅనుమానం ప్రతీఒక్కరికీ కలుగుతోంది.

జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలతో ఎందరోమహిళల తాళిబొట్లు తెగిపోయినా ఈముఖ్యమంత్రిలో చలనంలేదు. ఆఖరికి అక్కడజరిగింది సారామరణాలు కాదు…సహజమరణాలనిచెప్పి, మృతులకుటుంబాలను జగన్మోహన్ రెడ్డి దారుణంగా అవమానిం చాడు. తన నాయకత్వంలో రాష్ట్రంలో 1500లకు పైగా హత్యలు , అత్యాచారాలు మహిళలు చిన్నారులపైజరిగితే ఈముఖ్యమంత్రి ఆయాఘటనల్లోఎందరిని శిక్షించాడని ప్రశ్నిస్తున్నాం.

డ్వాక్రామహిళలు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీలు,ఆశావర్కర్లు సహా సామాన్యమహిళలెవరికీ రాష్ట్రంలో జీవనభద్రత అనేది లేకుండా పోయింది. అందుకుప్రధానకారణం ముఖ్యమంత్రి అండదండలతో రెచ్చిపోతున్న వైసీపీకాలకేయులుకాదా?

మహిళాసంక్షేమం గురించి డబ్బాలుకొడుతూ, మహిళాదినోత్స వాలునిర్వహించిన ప్రభుత్వపెద్దలు, ప్రభుత్వంలోనిమహిళానేతలు అందరూ వైసీపీమృగాళ్ల దారుణాలకు బలైనమహిళలు, చిన్నారులు, యువతులను ఒక్కసారి తలుచుకొని ఉండాల్సింది. నిజంగా మహిళాదినోత్సవం అనేది చేయాలనుకుంటే ప్రభుత్వం లోని మహిళాప్రజాప్రతినిధులంతా వైసీపీకాలకేయుల దారుణాల కు బలైన మహిళలు, యువతులఇళ్లకువెళ్లి, వారికుటుంబసభ్యు లతో సంబరాలుచేసుకొని ఉంటే, వారుపడే బాధేమిటో అధికారం లోఉన్నవారికి అర్థమైఉండేది.

నడిరోడ్డుపై చంపబడిన రమ్య సహా, అంతకుముందు, ఆతరువాత యువతులపై జరిగినదారుణాలపై వైసీపీ మహిళా ప్రజాప్రతినిధులు…మహిళామంత్రులు దేనికి స్పందించలేకపోతున్నారు. మహిళగా హోంమంత్రిగా ఉన్నారని రాష్ట్రంలోని మహిళల భద్రతకు ఢోకా లేదని గతంలో తామంతా భావించాము. కానీ వాస్తవంగా చూస్తే సదరుహోంమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయి, కొందరుప్రభుత్వపెద్దలు ఆడమన్నట్లు ఆడుతూ, రాష్ట్రంలోని దిశాచట్టంతో ఉరిశిక్షలు, యావజ్జీవశిక్ష లు వేశామనిచెప్పుకొని అభాసుపాలయ్యారు.

వైసీపీనేతలు, ఎమ్మెల్యేలు,మంత్రులే మహిళలగురించి అసభ్యంగా మాట్లాడుతూ వారిని కించపరుస్తున్నాకూడా ముఖ్యమంత్రి ఏనాడూ వారిని వారించిందిలేదు. ఒకమంత్రేమో అరగంట అంటాడు…మరోకాయనేమో సంజనా..సంజనాఅంటాడు. వైసీపీ ఎంపీలపై గృహహింసకేసులు నమోదైనా ముఖ్యమంత్రిపట్టించు కోలేదు. అలాంటి పాలకులఏలుబడిలో ఏమహిళకైనా, యువతి కైనాఇసుమంతైనా భద్రతఉంటుందా?

ఆడబిడ్డలు,చిన్నారులపై అఘాయిత్యాలకుపాల్పడేవారికి, నేరస్తులకు, రౌడీలకు, పేకాటరాయుళ్లకు, మద్యం,సారా తయారుచేసేవారికి వైసీపీప్రభు త్వమేకొమ్ముకాస్తుంటే, ఇక రాష్ట్రంలోని మహిళలమానప్రాణాలకు రక్షణ ఎక్కడుంటుందని ప్రశ్నిస్తున్నాం.

అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంల వంటివారురోడ్లపైకి వస్తున్నది వారిన్యాయమైన డిమాండ్లకోసమేనని ముఖ్యమంత్రి ఎంతత్వరగా తెలుసుకుంటే అంతమంచిది. జగన్మోహన్ రెడ్డికిగానీ, ఆయనప్రభుత్వంలోని వారికిగానీ మహిళలభద్రత, వారిసంక్షేమం గురించి మాట్లాడే అర్హతలేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రికి భజన చేసేవారంతా వాస్తవాలు తెలుసుకోవాలంటే సమాజంలోకి రావాలి.
వైసీపీ ప్రభుత్వ వేధింపులు, ధనదాహానికి ఎంతమంది మహిళల పుస్తెలు తెగిపోతున్నాయో ఇప్పటికైనా వైసీపీమహిళాప్రజాప్రతిని ధులు తెలుసుకుంటే మంచిది. కనకపుసింహాసనంపై శునకము కూర్చుంటే ఎలాఉంటుందో.. నేరచరితుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆయనపార్టీవారు… ప్రభుత్వంలోని వారితోపాటు క్షేత్రస్థా యిలోని వైసీపీకార్యకర్తలు మహిళలవిషయంలోఎలాప్రవర్తిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు.

సొంత చెల్లిని, తల్లిని తన అధికారంకోసం వాడుకొని రోడ్డునపడేసినవ్యక్తి, సొంతబాబాయ్ ని అధికారంకోసంబలితీసుకున్నవ్యక్తి రాష్ట్రంలోని మహిళలు, చిన్నా రులనురక్షిస్తాడు…వారిని ఉద్ధరిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? రాష్ట్రంలోఆడబిడ్డలు, చిన్నారుల రక్షణ గాలిలోదీపంగా మారడాని కికారణం ముమ్మాటికీ ముఖ్యమంత్రి అసమర్థతే. తనబాబాయ్ కూతురుసునీతే స్వయంగా ఏపీప్రభుత్వంనుంచి తనప్రాణాలకు హాని ఉందని వాపోయిందినిజంకాదా?

మచిలీపట్నంలో వైసీపీనేతవేధింపులవల్ల చనిపోయిన నాగలక్ష్మీ కుటుంబానికి, బోయపాలెంలో వైసీపీనేతకుమారుడి వేధింపులకు బలైన అంగన్ వాడీ ఆయాకు, ఆమెకుటుంబానికి ఈప్రభుత్వం న్యాయంచేసేవరకు వదిలిపెట్టము. రెండుఘటనల్లో బాధ్యులైన వైసీపీనేతలను ముఖ్యమంత్రి శిక్షిస్తాడో.. లేక రక్షిస్తాడో కూడా చూస్తాము.

LEAVE A RESPONSE