Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం

– మీడియాతో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో 125 మంది ఎంపీల సంతకాలు వైసిపి సేకరించింది.లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ,లాభర్జనకు అవకాశం ఉన్న సంస్థల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తున్న వివిధ పార్టీల ఎంపీల సంతకాలు సేకరించాం.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు వైసిపి ఒక సదస్సును ఏర్పాటు చేసి కార్మిక సంఘాలకు మెమోరాండం అందజేస్తుంది.త్వరలో ప్రధానికి ప్రయివేటికరణకు వ్యతిరేకంగా మెమోరాండంను సమర్పిస్తాం. ఆర్ఐఎన్ఎల్ నష్టాల నుంచి లాభల్లోకి వచ్చింది.ఆర్ఐఎన్ఎల్ నష్టాల్లో ఉందంటే ప్రజలను తప్పుదోవ
vijayasai-pic
పట్టించినట్లే.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము సేకరించిన సంతకాల్లో టిడిపి ఎంపీ మా లెటర్ హెడ్ పై సంతకం చేయలేదు..ఖాళీ పేపర్ పై సంతకం చేస్తా అన్నారు.

ఏపీలో పెండింగ్ లో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల గురించి రైల్వే మంత్రితో మాట్లాడాం.4200 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా నిధులను లోన్ రూపమ్ లో చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరాం.రైల్వే జోన్ ఏర్పాటు త్వరలో పూర్తవుతుందని కేంద్రమంత్రి తెలిపారు.సౌత్ సెంట్రల్ రైల్వె లో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరాంఎంపీ నియోజకవర్గాల వారీగా అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలు,ఇతర రైల్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరాం.రెండు వందే భారత్ రైళ్ళు ఏపీకి కోరాం.విశాఖ హైదరాబాద్, విశాఖ చెన్నై మధ్య వందే భారత్ రైళ్లు ఏర్పాటు చేయాలని కోరాం.

LEAVE A RESPONSE