-జగన్ రెడ్డీ…నీచేతగానితనం, అసమర్థత…నీ కేసుల భయమే పోలవరానికి శాపంగా మారింది
– అందుకే ఈ మూడేళ్లలో ప్రాజెక్ట్ పనులు మూడుశాతంకూడా చేయించలేకపోయావు. చంద్రబాబు పోలవరంపనుల్లో అవినీతిచేస్తే, అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఏం పీకావు? ఎందుకు టీడీపీ అవినీతిని నిరూపించలేకపోయావు?
• తనచేతగానితనంతో మూడేళ్లలో పోలవరంపనులు మూడుశాతంకూడా జగన్ రెడ్డి పూర్తిచేయలేకపోయాడు.
• పోలవరంపూర్తికాకపోవడానికి చంద్రబాబునాయుడే కారణమని ఇప్పటికీ అసెంబ్లీలో పచ్చిఅబద్ధాలుచెబుతున్న జగన్ రెడ్డి.. తన అసమర్థతను, చేతగానితనాన్ని, చేవలేనివైనాన్ని చంద్రబాబుపైకి నెట్టేయాలనిచూస్తున్నాడు.
• కేంద్రమంత్రి షెకావత్ ఇటీవల పోలవరం సందర్శనకు వచ్చినప్పుడు, రెండేళ్లలో 2.84శాతం పనులే జరిగాయని జగన్ రెడ్డేచెప్పాడు.
• నాటుసారా మరణాలపై ఉభయ సభల్లో చర్చ జరిగితే తన మద్యం వ్యాపారం లొసుగులు ప్రజలకు తెలుస్తాయని ముఖ్యమంత్రి భయపడుతున్నాడు
– టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
ప్రతిపక్షంలోఉన్న మేము ప్రజలకోసం బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రజలగోడు పట్టించుకోకుండా పలాయనవాదంతో వ్యవహరిస్తున్నాడని, కల్తీ సారా, జేబ్రాండ్స్ మద్యంతో 42మందివరకు చనిపోయినాకూడా జగన్మోహన్ రెడ్డి స్పందించ కుండా తానుసాగిస్తున్న మద్యంవ్యాపారంతాలూకా లొసుగులు ప్రజలకు తెలుస్తాయన్న భయంతోనేఅసెంబ్లీ, మండలిలో నాటుసారామరణాలపై చర్చకురాకుండా ముఖంచాటేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు.
మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే
పోలవరం ప్రాజెక్ట్ ని ఏదోఉద్ధరించినట్లు గా ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ఆయన మంత్రు లు టీడీపీసభ్యులను బయటకుపంపిమరీ డబ్బాలుకొట్టుకున్నారు. పోలవరం పేరుఎత్తే నైతిక అర్హతకూడా జగన్ రెడ్డికిలేదు. 2004 నుంచి 2014మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయో కేంద్రప్రభుత్వమే గతంలో నివేదికలతో సహావాస్తవాలుచెప్పింది. ఆ సమయంలో ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు కేవలం 7శాతంమాత్రమే పూర్తయ్యాయి.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకనే పోలవరం పనులు పరుగులుపెట్టాయి. కేవలం 5ఏళ్లలోనే ప్రాజెక్ట్ పనులను 72శాతంవరకు పూర్తిచేశారు. అదీ చంద్రబాబు పని తనం. కేవలం 24గంటల్లోనే 32,350 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయించారు. చంద్ర బాబునాయుడు హయాంలో జరిగిన పనులతాలూకా బిల్లులు తీసుకోవడంతప్ప…. ఈ ముఖ్యమంత్రి వచ్చాక అరడుగుకూడా అక్కడపనులు జరగలేదు. సారామరణాలపై ఎలాగైతే ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీలో అబద్ధాలుచెప్పాడో..అలానే పోలవరంపై కూడా మంత్రులు, ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పాడు.
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 10, 2020లో చేసిన సమీక్షలో 41.10శాతం పనులు జరిగాయన్నాడు. అదే జగన్ రెడ్డి మార్చి 20, 2022న కేంద్రమంత్రి షెకావత్ పోలవరాన్ని సందర్శించిన సందర్భంలో చేసిన సమీక్షలో 42.94శాతంపనులు జరిగాయన్నాడు. రెండేళ్లలో తనహాయాంలో పోలవరంప్రాజెక్ట్ పనుల్లో చచ్చీచెడీ కేవలం 2.84 శాతంపనులు జరిగాయని స్వయంగా జగన్ రెడ్డే చెప్పాడు. ముఖ్య మంత్రి చేసిన సమీక్షలు, ఆయన వెల్లడించిన వివరాలే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఎంతవేగం గా జరుగుతున్నాయో అర్థమవుతోంది.
పోలవరం ప్రాజెక్ట్ ని ఎప్పుడు పూర్తిచేస్తారేనేదానిపై కూడా ఈ ముఖ్యమంత్రి, జలవనరుల శాఖామంత్రి ఎప్పటికప్పుడు నాలుకమడతపెడుతూనే వచ్చారు. చంద్రబాబునాయుడు అధి కారంలో ఉన్నప్పుడు 2020 జూన్ నాటికిపోలవరం ప్రాజెక్ట్ పూర్తికావాలన్న ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పోలవరంపై తొలిసారి మాట్లాడినప్పుడు 2021 జూన్ లో పూర్తిచేస్తామన్నాడు. తరువాతేమో 2021 డిసెంబర్ అన్నాడు.. ఇప్పుడేమో 2023 ఖరీఫ్ అని అసెంబ్లీలో చెప్పాడు. 2020 జూన్ కి పూర్తికావాల్సిన పోలవరం ప్రాజెక్ట్, జగన్మోహన్ రెడ్డి అసమర్థత. చేతగానితనం,…దద్దమ్మతనం వల్ల 2023 ఖరీఫ్ వరకు వెళ్లింది. 2023 ఖరీఫ్ నాటికి కూడా ఈ ముఖ్యమంత్రి పోలవరం పూర్తిచేస్తాడనే నమ్మకం ఏపీప్రజలకు లేదు.
పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు అవినీతిచేసుంటే, అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతున్నాడు?
పోలవరం ప్రాజెక్ట్ ను తన అవినీతికోసమే చంద్రబాబునాయుడు చేపట్టారని, కేంద్రప్రభుత్వం నిర్మించాల్సిన దాన్ని రాష్ట్రప్రభుత్వంతరుపున కడతామని ఎందుకు ఒప్పుకున్నాడని, పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు ఏటీఎమ్ గా మార్చుకున్నాడని స్వయంగా మోదీనే చెప్పారని జగన్మోహన్ రెడ్డి సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చి మూడేళ్లైనాకూడా ఇప్పటికీ పోలవరంలో చంద్రబాబు, టీడీపీచేసిన అవినీతిని నిరూపించకుండా, ఏంపీకుతున్నాడని సూటిగా ప్రశ్నిస్తున్నాం.
పెంటపాటి పుల్లారావు అనే వ్యక్తి పోలవరంప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటున్న ఆరోపణలపై నిగ్గుతేల్చాలని, దానికి సం బంధించి విచారణ చేపట్టాలంటూ ఢిల్లీ హైకోర్ట్ లో 2020 జూన్ 27 న పిటిషన్ వేశారు. ఆ పిటి షన్ పై కేంద్రజలశక్తి సంఘం ఢిల్లీ హైకోర్ట్ కి సమాధానమిస్తూ, పోలవరంప్రాజెక్ట్ లో రూపాయి కూడా అవినీతిజరగలేదని స్పష్టంగా లిఖితపూర్వకసమాధానం ఇచ్చింది. ఆ విషయం ఈ ముఖ్యమంత్రికి తెలుసు.
కానీ కేవలం అబద్ధాలనే నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వాటినే అసెంబ్లీలో చెప్పుకుంటూ, ప్రజలను దారిమళ్లిస్తున్నాడు. పోలవరం ఎత్తుతగ్గిస్తున్నారని చంద్రబాబు..ఎల్లో మీడియా దుష్ప్రచారంచేస్తున్నారని కూడా జగన్ రెడ్డి చెప్పాడు.
తెలంగాణ శాసనసభలో పోలవరం ఎత్తుకి సంబంధించి ఆరాష్ట్రముఖ్యమంత్రి వారి అసెంబ్లీలో ఏం చెప్పాడో జగన్ రెడ్డికి తెలియదా? తెలిసినా తెలియనట్టునటిస్తున్నాడని తాము అంటా ము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 సెప్టెంబర్ 15న, ఆరాష్ట్రఅసెంబ్లీలో మాట్లాడు తూ, 45.72 మీటర్లుగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని 2, 3 మీటర్లు తగ్గిస్తే ఏపీకివచ్చే నష్టమేమీలేదని, దానివల్ల భద్రాచలం ప్రాంతం కూడా ముంపునకు గురికాకుండా ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఎత్తు తగ్గించడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికూడా సుముఖంగా ఉన్నాడని కేసీఆర్ అంటే, ఆయన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తున్నాం.
గతంలో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అంచనాలను రూ.55,548కోట్లకు కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ఆ మొత్తం వ్యయానికి సంబంధించిననిధులను తెచ్చుకోలేని అసమర్థస్థితిలో, డీటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లను కేంద్రానికి సమర్పించలేని చేతగానితనంతో జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ లో నీటినిల్వ సామర్థ్యాన్ని తగ్గించడానికి సిద్ధమయ్యాడు. ప్రాజెక్ట్ లో నిల్వ ఉంచాల్సిన నీటిసామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తగ్గించడానికి సిద్ధమయ్యాడో సమాధానం చెప్పాలి.
నీటినిల్వ సామర్థ్యాన్ని తగ్గించడంద్వారా పునారావాసఖర్చులు తగ్గిం చుకోవచ్చన్న దురాలోచనలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రాజెక్ట్ ఎత్తుని 45.72 మీటర్ల వరకు ఉంచితే లక్షా07వేల నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి పరిహారంఇవ్వాల్సి ఉం టుంది. అదేఎత్తుని 41.15మీటర్లకు తగ్గించేసి, దానితోపాటు నీటినిల్వసామర్థ్యంకూడా తగ్గించేస్తే నిర్వాసితకుటుంబాల సంఖ్య కేవలం 45వేల కుటుంబాలకే పరిమితమవుతుంది. ఇవన్నీ గమనించే ఈచేతగాని ముఖ్యమంత్రి నీటినిల్వసామర్థ్యాన్ని తగ్గించడానికి సిద్ధపడ్డా డు.
కేంద్రంనుంచి రూ.55,548కోట్ల సవరించిన అంచనాలనిధులు తెచ్చుకోలేకనే జగన్ రెడ్డి, కేవలం రూ.33వేలకోట్లవ్యయానికే పరిమితమై ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కుదించాలని చూస్తున్నా డు. జగన్మోహన్ రెడ్డిఆలోచనలు ఇలాఉన్నాయని మొన్నటికి మొన్న జరిగిన కేంద్రజలశక్తి సంఘం సమావేశంలో ఏపీ అధికారులే బయటపడ్డారు. వారిచ్చిన ప్రజంటేషన్ లో 41.15 మీటర్లకు పరిమితమైతే రూ.20వేలకోట్లు మాత్రమే ఖర్చవుతాయని చెప్పుకొచ్చారు.
పోలవరంప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రరూపురేఖలు మారిపోతాయని భావించే చంద్రబాబుగారు దాని నిర్మాణాన్ని ఎక్కడా కుదించకుండా నిర్మాణంచేపట్టారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని గతంలో అనుకున్నవిధంగా 45.72 మీటర్లే ఉంచితే దానిలో 194టీఎంసీలవరకు నీటిని నిల్వ చేయొచ్చు. కానీ దానిఎత్తుని 41.15మీటర్లే చేపడితే కేవలం 119టీఎంసీలు మాత్రమే నిల్వచేయడానికి వీలవుతుంది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో నదులఅనుసంధానం చేపట్టే దిశగా చంద్రబాబుగారు ప్రణాళికలు వేశారు. దానిలోభాగంగా అటుఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు గోదావరిజలాలు అందించేలా ప్రణాళికలువేసి, తదనుగుణంగా నిర్మాణంచేపట్టారు. ఇవన్నీ ప్రజలకుతెలియవులే అన్నట్లుగా ఈముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పోలవరంపై పచ్చిఅబద్ధాలుచెప్పాడు. పోలవరంపై జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నా టకాలతో ఏపీ రైతాంగం తీవ్రంగా నష్టపోనుంది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రతి డిజైన్ కేంద్ర ప్రభుత్వవిభాగంలోని డ్యామ్ డిజైన్ రివ్యూకమిటీనే నిర్దారిస్తుంది. వారి డిజైన్ల ప్రకారమే ఏపీ ప్రభుత్వం గతంలో ప్రాజెక్ట్ పనులు చేయించిందనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే మంచిది. చంద్రబాబుగారు ఎక్కడా తనవ్యక్తిగతస్వార్థంకోసం ప్రాజెక్ట్ ని బలి పెట్టలేదనేది నూటికినూరుశాతం నిజం. ప్రాజెక్ట్ పూర్తిచేయకపోవడానికి, కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోవడానికి, దాన్నిగతంలో అనుకున్నవిధంగా పూర్తిచేయలేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి అసమర్థత…చేతగానితనంతోపాటు ఆయనకు సంబంధించిన కేసుల భయమేకారణం.
నాటుసారా మరణాలపై చట్టసభలో చర్చజరిగితే తనదోపిడీ బయటపడుతుందని ముఖ్యమంత్రికి భయంపట్టుకుంది :
జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఒక మద్యంకార్పొరేషన్ పెట్టి, దానిద్వారా సంక్షేమకార్యక్రమాలు అమలుచేయాలనిచూడటం ఆయనకే చెల్లింది. దానికి సంబంధించిన బిల్లుని డైరెక్ట్ గా తీసుకొచ్చాడు… ఈ ముఖ్యమంత్రి. తండ్రితాగితేనే పిల్లాడికి అమ్మఒడిఇస్తానని, భర్త మద్యం తాగితేనే భార్యకు చేయూతకింత సొమ్ముఇస్తామని, కుమారుడు తాగితేనే తల్లికి వృద్ధాప్య పింఛన్ వస్తుందన్నవిధంగా ముఖ్యమంత్రి సదరు కార్పొ రేషన్ ను తీసుకొచ్చాడు.
మద్యపా నిషేధం మాటపక్కనపెట్టి మరీ ఈ ముఖ్యమంత్రి రాబోయే 15ఏళ్లపాటు మద్యంపై వచ్చేఆదాయాన్ని తాకట్టుపెట్టి మరీ రూ.25వేలకోట్ల అప్పులు తెచ్చాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆడబిడ్డల తాళిబొట్లను తాకట్టుపెట్టి, తనకుకావాల్సిన అప్పులు తెచ్చుకున్నా డు. ఇలాంటి అనేకఅంశాలు సభలో చర్చకువచ్చి, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే ముఖ్య మంత్రి ఉభయసభల్లో నాటుసారామరణాలపై, మద్యంఅమ్మకాలపై చర్చజరక్కుండా అడ్డు కున్నాడు.
తానొక మహిళాద్రోహి అనే విషయం ఆడబిడ్డలకు తెలియకూడదనే జగన్ రెడ్డి టీడీపీసభ్యులకు సమాధానంచెప్పకుండా సభనుంచి పారిపోయాడు. జేబ్రాండ్ర్ పేరుతో ప్రభుత్వం అమ్ముతున్న పిచ్చిమద్యంతోపాటు, నాటుసారా ఇతరత్రామాదకద్రవ్యాల అమ్మకా లతో రూ.10వేలకోట్లను ఈ ముఖ్యమంత్రి ప్రజలనుంచి దోచుకుంటున్నాడు. ప్రభుత్వానికి మద్యం అమ్మకాలరూపంలో ఏటా వస్తున్న రూ.16,500కోట్లు కాకుండా, అదనంగా రూ.10వేలకోట్లను ఈ ముఖ్యమంత్రికాజేస్తున్నాడు.
దానికి సంబంధించిన వివరాలన్నింటి నీ త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాం. కల్తీసారా మరణాలపై న్యాయవిచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తుంటే టీడీపీ సభ్యులను బయటకుపంపి, ముఖ్యమంత్రితనమంత్రులు, తన ఎమ్మెల్యేలతో భజన చేయించుకుంటున్నాడు.