Suryaa.co.in

Andhra Pradesh

నన్ను ఇంకా సస్పెన్షన్‌లో ఉంచే అధికారం సర్కారుకు లేదు

– నాకు పూర్తి జీతం ఇప్పించండి
– సీఎస్‌కు సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

నిబంధనల ప్రకారం తనపై విధించిన సస్పెన్షన్ గడువు ముగిసినందున, ఇంకా తన సస్పెన్షన్‌ను కొనసాగించే హక్కు ప్రభుత్వానికి లేదని ఏపీ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. తన సస్పెన్షన్ పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వును తనకు అందివ్వకపోవడంపై ఏబీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు తన లేఖలో ఏం ప్రస్తావించారంటే….

అమరావతి: సస్పెన్షన్ కు 2022 ఫిబ్రవరి 8 తో రెండేళ్లు నిండిన కారణం గా రూల్ ప్రకారం సస్పెన్షన్ ఆటోమేటిక్ గా తొలగి పోయినట్లే. సర్వీస్ రూల్స్ ప్రకారం సస్పెన్షన్ తొలగినందున నా పూర్తి జీతం వెంటనే ఇవ్వండి.నా సస్పెన్షన్ కు ఆరేసి నెలల వంతున ఇచ్చిన పొడిగింపు జనవరి 27 తో నే ముగిసింది.రెండేళ్లకు మించి సస్పెన్షన్ ను కొనసాగించాలంటే…కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పని సరి. గడువులోగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు కాబట్టి….సస్పెన్షన్ ముగిసినట్లే. 31.7.2021 న చివరిసారిగా నా సస్పెన్షన్ ను పొడిగిస్తూ, ఇచ్చిన జీఓను రహస్యంగా ఉంచారు.నాకు కాపీ ఇవ్వలేదు. ఏమైనప్పటికీ… ఫిబ్రవరి 8 తో నా సస్పెన్షన్ ముగిసినట్టే.
ab-letter-to-cs

LEAVE A RESPONSE