సభాసమావేశాల చివరిరోజున “తాళిబొట్లు తెంచుతూ, ఆడబిడ్డలను, కుటుంబాలను రోడ్లపాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి” … “సారామరణాల పాపం ఎవరిదీ.. జగన్ రెడ్డిదీ”, “తనదోపిడీకోసం మగవాళ్ల ప్రాణాలు తీస్తూ, ఆడబిడ్డల పుస్తెలు తెంచుతున్న జగన్ రెడ్డి” … “కల్తీమద్యంపై, నాటుసారాపై, 42 మరణాలపై చర్చజరపాలి”, “అబద్ధాలు, అసత్యాల సీఎం డౌన్ డౌన్” అంటూ అసెంబ్లీప్రాంగణంలో నినాదాలు చేసిన టీడీపీఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.
ప్రజలెదుర్కొంటున్న ఇతరసమస్యలపైన కూడా చర్చించలేదు:నిమ్మకాయల చినరాజప్ప
సభప్రారంభమైన దగ్గరనుంచీ సారామరణాలు, మద్యంమరణాలపై చర్చించాలని పట్టుపట్టినా ముఖ్యమంత్రి స్పందించలేదు. సారామరణాలు జంగారెడ్డిగూడెంలోనేకాదు…రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. తమకుసమాధానంచెప్పలేక, ప్రజలముందు దోషిగా నిలబడ లేకనే జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు. అసెంబ్లీనిర్వహించింది ముఖ్యమంత్రిని పొగుడుకోవడానికా? తాము లేవనెత్తిన అంశాలపై చర్చించలేదుసరే… పోనీకనీసం ప్రజలు పడుతున్నబాధలు, ఇతరసమస్యలపైనైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి సభలో చర్చించారా….అంటే అదీలేదు. 27 మంది కల్తీసారాతో చనిపోయారు … ఆఘటనపైన్యాయవిచారణ జరిపించండి అంటే స్పందించలేదు. ఆఖరిరోజని సభలో తాళిబొట్లు చూపించినా స్పీకర్ స్పందించలేదు.
సారామరణాలు, మద్యం అమ్మకాలపై సభలో చర్చించడానికి భయపడుతున్నారంటే ప్రభుత్వం సాగిస్తున్న మద్యం అమ్మకాల్లో కచ్చితంగా అవకతవకలు జరుగుతున్నాయనే భావించాలి : శ్రీమతి ఆదిరెడ్డి భవానీ
సభ ప్రారంభమైన నాటినుంచీటీడీపీసభ్యులకు సమాధానంచెప్పడానికి కూడా ముఖ్య మంత్రికి మనసురాలేదు. సారామరణాలు… జేబ్రాండ్స్ మద్యంఅమ్మకాలపై సభలో చర్చించడానికి భయపడుతున్నారు అంటే తప్పకుండామీరు మద్యంఅమ్మకాల ముసుగులో పెద్దకుంభకోణానికి పాల్పడుతున్నారని అర్థం. ప్రభుత్వం సాగిస్తున్న మద్యం అమ్మకాల్లోతప్పకుండా అవకతవకలు జరుగుతున్నాయనే చెప్పాలి. వాళ్లు అనుకున్నవిధం గానే సభను నిర్వహించేశారు.. సభ అయిపోయింది. మా గొంతునొక్కేసి, వారుఅనుకున్నది సాధించుకున్నారు. కానీ తాము ప్రజలకు చెప్పాలనుకున్నదిచెప్పకుండా ఆపలేరుగా!
వైసీపీ వాళ్లు ముఖ్యమంత్రి భజనచేస్తున్నారని…సభను గాడిలోపెట్టడానికే తాము చిడతల భజనచేశాము : వేగుళ్ల జోగేశ్వరరావు
ప్రభుత్వం అమ్ముతున్న జేబ్రాండ్స్ మద్యంలోను, కల్తీసారాలోని హానికారక, విషపదార్థాల వల్ల ప్రాణాలు పోతున్నాయని మొత్తుకున్నాకూడా సభలో సారామరణాలపై చర్చించలేదు. ప్రభుత్వం, అధికారపార్టీసభ్యులు ఎలాగూ ప్రజలసమస్యలపై చర్చించడంలేదనే తాముసభలో చిడతలువాయిస్తూ భజనకార్యక్రమం మొదలుపెట్టాము. సభలో ముఖ్య మంత్రి సత్య దూరమైన ప్రకటనలుచేశాడుతప్ప, తానుచెప్పేది ఎంతవరకువాస్తవమని నిరూపించలేక పోయాడు. ముఖ్యమంత్రి సారామరణాలపైచేసిన ప్రకటనతోపాటు, తమవద్ద ఉన్న ఆధారాలపై చర్చించాలని తాముపట్టుబడితే, స్పీకర్ కనీసం మావైపుకూడా చూడకుండా, మమ్మల్ని సస్పెండ్ చేయడమే పనిగాపెట్టుకున్నాడు.