-అక్రమకేసులు వెంటనే ఎత్తివేయాలి
– విద్వేషం, విధ్వంసమే వైసీపీ ఉనికి
– అచ్చెన్నాయుడు
విద్వేషం, విధ్వంసమే వైసీపీ అజెండాగా మారింది. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే కొత్త సాంప్రదాయానికి జగన్రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతకు స్థలం అమ్మలేదన్న నెపంతో షాపును తొలగించడం దుర్మార్గం. ఈ అరాచకాన్ని ప్రశ్నించిన తెదేపా నేతలు డూండీ రాకేష్, యుగంధర్, పెండ్యాల వెంకట్రావుతోపాటు పలువురు తెదేపా నేతలపై కేసు నమోదు చేయడం దుర్మార్గం. మారణాయుధాలు, రాళ్లతో దాడి చేసిన వైసీపీ నేతలపై కేసు కూడా నమోదు చేయకుండా బాధితులకు అండగా నిలబడిన తెదేపా నేతలపై కేసులు పెట్టడం హేయనీయం. వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా చేశారు. అధికారమదంతో నరరూప రాక్షసుల్లా వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. తెదేపా నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.