చైనా వదిలితే ఏరికోరి
ప్రవర్తించి హద్దు మీరి
కొన్ని దేశాలు చేసాయి
దానినో మహమ్మారి…
ఇప్పుడు హద్దు తెలిసి
మనముంటే
అది రోజుకో రంగు మారి
మృత్యుదేవతగా రూపుదేరి
ఇంటింటా దూరి
మళ్ళీ బయలుదేరి..
చుట్టూ తిరిగి
జన్మభూమి చైనా చేరి..
అక్కడ జిన్ పింగ్
అనబడే మన వైరి
కొత్త క్రిములను
మళ్లీ కూరి..
వదిలినా మన మీదకి
మరో తూరి..
మనం లొంగిపోరాదు
ఇంకోసారి
అత్మబలమే ఆయుధంగా
చెప్పేద్దాం దానికి
ధైర్యంగా
ఈసారి..ఓ సారి..!
దెబ్బకు తోకముడిచి
వెళ్లిపోవాలి కర్మభూమిని విడిచి
శాశ్వతంగా దాని జన్మభూమికి
ఆ మహమ్మారి
చైనా దూలదీరి..!
(చివరి పదం
క్షమాపణలతో..)
ఇ.సురేష్ కుమార్
9948546286