– అమరావతి నుంచి రాజధానిని ఎవరు తరలించలేరు
– బీజేపీ జాతియ కార్యదర్శి సత్య కుమార్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి నుంచి రాజధానిని తరలించే ధైర్యం ఎవరికీ లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారు. అలాంటి ధైర్యం చేసే వ్యక్తి, శక్తి ఇప్పటిదాకా పుట్టలేదు. పుట్టబోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
విజయవాడలో లైవ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ వల్లూరు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల గెలుపులో ముఖ్య పాత్ర వహించి అఖండ మెజారిటీ తో గెలిపించిన సందర్భంగా భాజాపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు.
సత్యకుమార్ ఏమన్నారంటే… బీజేపీ అమరావతి విషయంలో స్పష్టంగా నిర్ణయం వెల్లడించింది. అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర నిధులు విడుదల చేసింది. తాత్కాలిక రాజధాని కోసం నిధులు ఇచ్చింది.రైతుల జీవితాలు చిన్నా భిన్నం అయ్యాయ్యన్న ఆలోచన సీఎంకు లేదునేను నా కుటుంబం
బాగుండాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారు.మెట్రోకు డిపిఆర్ రెడీ చెయ్యాలని చెప్పినా టీడీపీ,వైసీపీప్రభుత్వాలు స్పందించలేదు.విభజన హామీలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం ప్రత్యేక హోదా అస్సలు చట్టంలోనే లేదు.అమరావతి నుంచి రాజధానిని ఎవ్వరు తరలించలేరు. రాజధాని తరలించే వ్యక్తి,శక్తి పుట్టలేరు పుట్టబోరు.అమరావతిని ఎవరు తరలించే ప్రయత్నం చేసిన బీజేపీ అడ్డుకుంటుంది. 18 కేంద్ర సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం భూములు తీసుకుంది. ఆ సంస్థలు అన్ని త్వరగా పనులు ప్రారంభించేలా చూస్తాం 18 సంస్థలకు అనుగుణంగా ఉన్న 40 కార్యాలయాలను త్వరలోనే ఏర్పాటు చేసేలా చూస్తాం.
అవసరం అయితే ప్రతి 15 రోజులకు కేంద్రంలోని అందరిని ఒక్కసారి కలిసి విన్నవిస్తాం.వ్యక్తిగత కక్షలతో రాజధాని తరలించి మూడు రాజధానులు అన్నావు.హైకోర్టు మొట్టికాయలు వేశాక పరిపాలన వికేంద్రీకరణ అంటూ కొత్త రాగం అందుకున్నారు.విజయవాడ,అమరావతిలో రాజధాని ఉండాలని నువ్వు శాసనసభలో చెప్పింది నిజం కాదా.రాజధాని విషయంలో పరిపాలన వికేంద్రీకరణ పేరుతో సీఎంను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు.అధికార వికేంద్రీకరణకు పరిపాలన వికేంద్రీకరణకు తేడా తెలియని వ్యక్తి సీఎం జగన్.కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం రాజధానిలో రహదారులు,విద్యుత్ ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెస్తాం.
అది నా ఘనత కాదు.. పార్టీ ఇచ్చిన అవకాశం: సత్యకుమార్
యుపీ ఎన్నికల్లో తనకు కేటాయించిన జిల్లాల్లో బీజేపీని విజయపథాన నడిపించిన ఘనత తనది కాదని, అది పార్టీ ఇచ్చిన అవకాశం మాత్రమేనని సత్యకుమార్ స్పష్టం చేశారు. ఆ విజయం తనది కాదని, లక్షలాది మంది సుశిక్షితులు, త్యాగధనులైన కార్యకర్తలదన్నారు. యుపీ ప్రజలు మోదీ-యోగి పాలనకు ఇచ్చిన తీర్పు అన్నారు. తాను కేవలం కో ఇన్చార్జిగా కార్యకర్తల మధ్య వారథిగా మాత్రమే వ్యవహరించానని చెప్పారు. యుపీ విజయంలో తానొక బిందువుగా ఉండటం పార్టీ కార్యకర్తగా గర్విస్తున్నానన్నారు.
ఏపీని యుపీ చేద్దాం..
కాగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని ఏపీ కార్యకర్తలు స్పూర్తిగా తీసుకుని, ఏపీని కూడా యుపీని చేద్దామని నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఏపీలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పునరంకితం కావాలని జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ పాల్పడుతున్న అరాచకాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొని సమర్ధవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు.
బీజీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సభకు అధ్యక్షత వహించగా…. రాష్ట్ర నాయకులు ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, పాతురి నాగభూషణం,నాగోతు రమేష్ నాయుడు,లంకా దినకర్, కిలారు దిలీప్, తురగా నాగభూషణం,కోలా ఆనంద్ ,తాళ్ల వెంకటేష్ యాదవ్,యడ్లపాటి రఘునాథ
బాబు,పాటిబండ్ల రామకృష్ణ,కాంటమనేని రవిశంకర్,మనేపల్లి అయ్యజి వేమ,యల్లా దొరబాబు,మరియు అమరావతి జె ఏ సి నాయకులు,రైతులు,మహిళా నాయకురాళ్లు, ప్రముఖ వ్యాపారవేత్త లు,విద్యావేత్తలు వందల సంఖ్యలో పాల్గొనగా లైవ్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ జయప్రకాశ్ నారాయణ సారథ్యం వహించారు.