Suryaa.co.in

Andhra Pradesh

48 గంటల్లో గ్రీష్మకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

– టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత

48 గంటల్లో గ్రీష్మకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీజీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఒక టీవీ చర్చలో కావలి గ్రీష్మపై వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి విచక్షణా రహితంగా మాట్లాడారు.

నారాయణమూర్తి మాటలతో యధా లీడర్ తథా కేడర్ అని నిరూపితమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను ప్రశ్నిస్తే ”మీపై అత్యాచారం జరగలేదు కదా” అంటారా?. ప్రశ్నించినప్పుడు చేతనైతే సమాధానం చెప్పాలిగానీ దుర్మార్గపు మాటలు మాట్లాడకూడదు. వైసీపీ పార్టీ కామాంధుల పార్టీ. సంయమనం కోల్పోయి మట్లాడే పశువులకు తగిన బుద్ధి చెప్పాలి. గ్రీష్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.

జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. 15 వందల మంది చనిపోతే ఏరోజూ సమీక్ష జరపలేదు. ఒక మహిళ హోం మినిష్టర్ గా ఉందని సంతోషించాం. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. హోం మినిష్టర్ ఒక రబ్బరు స్టాంపుగా మారారు. హోం మినిష్టర్ గానీ, మహిళా ఛైర్మన్ గాని గ్రీష్మపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై మాట్లాడలేదు. వాసిరెడ్డి పద్మ, రోజారెడ్డి, షర్మిలా లు టీడీపీ హయాంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని మాట్లాడారు.

ఇప్పుడు మాట్లాడరే? టీడీపీ హయాంలో మీపై అత్యాచారం జరిగివుంటేనే మాట్లాడారా? నారయణమూర్తి ఓ పిచ్చికుక్క. నారాయణమూర్తిలాంటి పిచ్చి కుక్కపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తాం. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళలకు పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తామని చెప్పి మహిళలు అభద్రతతో బతికేలా చేశారు. గ్రీష్మకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. గ్రీష్మను ప్రశ్నించినట్లుగా నారాయణమూర్తి కుటుంబంలోని మహిళలను ఎవరైనా ప్రశ్నిస్తే ఊరుకుంటారా?

సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న సీతా నగరంలో ఓ మహిళని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినా చర్యలు లేవు. గుంటూరులో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఉదయం పదిన్నర గంటలకే రమ్య అనే మహిళను అత్యంత కిరాతకంగా చంపేసినా, నరసరావు పేటలో అనూష అనే బాలికను చంపేసినా వారి గురించి పట్టించుకోలేదు, విచారణ జరపలేదు. దీంతో సీఎంకు మహిళలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. రాష్ట్రంలో మహిళలు చనిపోతే మానానికి ఒక రేటు ప్రాణానికి ఒక రేటు కడుతున్నారు.

మహిళా చైర్ పర్సన్ కమిషన్ గతంలో చంద్రబాబుపై విమర్శలు చేశారు. నేడు రబ్బర్ స్టాంప్ లా మారారు. లేని చట్టాన్ని తీసుకొచ్చి దానికి ప్రచారం చేసుకుంటూ మహిళలకు న్యాయం చేస్తామంటే మహిళలు నమ్మరు. అనూష, రమ్య ఇంటిముందుకొచ్చి వారికి న్యాయం చేశామని మహిళా దినోత్సవం జరిపే ధైర్యముందా? టీడీపీ హయాంలో దాచేపల్లిలో ఓ దుర్ఘటన జరిగితే 24 గంటల్లో 20 టీములతో విచారణ చేపట్టాం.

ఆ భయంతోనే ఆ వ్యక్తి ఉరేసుకొని చనిపోయాడు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసేది మా పార్టీనే. గ్రీష్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనితా పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, గౌతు శిరీషపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోతే విచారణ జరపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత హెచ్చరించారు.

LEAVE A RESPONSE