Suryaa.co.in

Features

గోవు మన ధర్మం.. గోవు మన దైవం

ఆవు అంటే అన్యమతస్తులు అడ్డగోలుగా కోసుకుతినే ఆహారం కాదు. ఆశ్రయం లేక రోడ్ల మీద తిరిగే అనాధ కాదు. కబేళాల్లో నెత్తుటి మడుగులో విలవిలలాడే విగతజీవి కాదు. గుప్పెడు గడ్డితిని, ఇచ్చే గుక్కెడు పాలు కాదు.
గోవు మన ధర్మం
గోవు మన దైవం
గోవు ముక్కోటి దేవతల నిలయం
గోవు మన ఆస్థి
గోవు మన అస్తిత్వం
గోవు మన సంప్రదాయం
గోవు మన సంస్కృతి
గోవు మన తల్లి
గోవు మన కుటుంబం
గోవు మన వేదం
గోవు మన జీవన నాదం
గోవంటే గో ఆధారిత వ్యవసాయం
గోవంటే గోబర్ గ్యాస్
గోవంటే గో ఆధారిత విద్యుత్తు.
గోవంటే గోమయ పెయింట్స్
గోవంటే గో ఆధారిత ఇటుకలు
గోవంటే గో ఆధారిత కట్టెలు
గోవంటే గో ఆధారిత ఎరువులు
గోవంటే గో ఆధారిత ఉత్పత్తులు
గోవంటే ప్రపంచం ప్రాణాలు నిలబెట్టే పంచగవ్యాలు
గోవంటే మల మూత్రాలు కూడా మహిమాన్వితమైన మహోన్నత వారసత్వ సంపద
గోవు మన దేశానికే సొంతమైన ఆధ్యాత్మిక కల్పవృక్షం
గోవు మనం కోరింది ఇచ్చే కామధేనువు
అలాంటి గోవుని ప్రతి క్షణం చిత్ర హింసలకు గురిచేస్తుంటే…
సగం గొంతు కోసి చంపేస్తుంటే…
తలక్రిందులుగా వేలాడగట్టి చర్మం వొలిచేస్తుంటే….
మనం భరించవద్దు.
విశ్వానికే ఆధారమైన గోవుని, విశ్వాసం మరచిపోయి వీధుల్లోకి నెట్టవద్దు.
ఆవు ఆహారం గురించి,
ఆవు అవసరాల గురించి,
ఆవు ఆరోగ్యం గురించి,
గోవుకి ఆశ్రయం ఇస్తున్న గోశాలల గురించి,
వాటి ఆర్ధిక ఇబ్బందుల గురించి,
ప్రాణాలకు తెగించి గో రక్షణ చేసే గో రక్షకుల గురించి,
వాళ్ళ త్యాగాల గురించి ఆలోచించండి.
మన గోమాతని, మన ధర్మాన్ని రక్షించు కుందాం.

– రవీంద్ర తీగల

LEAVE A RESPONSE