Suryaa.co.in

Andhra Pradesh

ప్రత్యేక ఆకర్షణగా ఫల పుష్ప ఆకృతులు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత శ్రీలంక ఆర్ట్‌తో చేసిన అలంక‌ర‌ణ‌లు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీప‌ద్మావ‌తి శ్రీ‌నివాసుల క‌ల్యాణ ఘ‌ట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న‌వ‌ధాన్య‌ల‌తో చెసిన శ్రీ‌మ‌హావిష్ణువు, శ్రీ‌రాముడి సెట్టింగ్‌లు భ‌క్తుల‌ను ఆక‌ర్షించాయి.
అదేవిధంగా ఆలయం బయట వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత‌, ద్వాప‌ర‌, క‌లియుగాల‌కు సంబంధించిన వివిధ స‌న్నివేశాల సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బ‌య‌ట‌ భక్తులు తమ చరవాణిలలో ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.

LEAVE A RESPONSE