•ఆదాయపెంపు, రాజకీయ ప్రయోజనాలకోసమే జగన్ రెడ్డి తలా తోక లేకుండా జిల్లాల విభజన చేశాడు
• అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, రాజకీయ ఒత్తిళ్లతో, ఆదాయమే లక్ష్యంగా చేసిన జిల్లాలవిభజనను తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సరిచేస్తుంది
• ఒకజిల్లాకు ఎన్టీఆర్ పేరుపెడితే, జగన్ రెడ్డికి ఆయనపై ప్రేమఉన్నట్టా? మరి ఎన్టీ ఆర్ పేరుతో ఉన్న పథకాలు, అన్నాక్యాంటీన్లు ఎందుకు మూసేశారో పేర్నినాని సమాధానంచెప్పాలి
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
జగన్మోహన్ రెడ్డి పరిపాలన మచ్చుతునకగా కొత్తజిల్లాలఏర్పాటుని చెప్పుకోవచ్చని, గతంలో రాష్ట్రవిభజన ఎంత అశాస్త్రీయంగా జరిగిందో, దానికంటే అశాస్త్రీయత, అసంబద్ధంగా ఇప్పుడు కొత్తజిల్లాలఏర్పాటు జరిగిందని టీడీపీసీనియర్ నేత, మాజీమంత్రి జవహర్ చెప్పారు.సోమవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశాన్ని ఆదాయవనరుగానే చూస్తున్నాడు. ఆలూచూలు లేని విధంగా తాజాగా ముఖ్యమంత్రి కొత్తజిల్లాలు ఏర్పాటుచేశాడు. ఉదయం జిల్లాలఏర్పాటు ప్రకటనవెలువడితే, సాయంత్రానికి రజత్ భార్గవ రిజిస్ట్రేషన్ ఛార్జీలుపెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంఏమిటి? డబ్బులు పోగేసుకోవడానికి,.. రాజకీయప్రయోజనాలకోసమే కొత్తజిల్లాలు ఏర్పాటుచేశారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది?
ప్రజలు కోరుకోకుండా.. రాజకీయప్రజాప్రతినిధుల సిసార్సులకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు ఏ జిల్లాలో ఉన్నామన్నదికోరుకోవడం లేదు.. రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలన ఉంటే చాలనుకుంటున్నారు. జిల్లాల విభజన అంతా రాజకీయఒత్తిళ్లు, తనవర్గం ఒత్తిళ్లకే ముఖ్యమంత్రి ప్రాధాన్యతఇచ్చాడు. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంప్రాంతాన్నికాదని భీమవరాన్ని జిల్లాని చేశారు. మండలి ఛైర్మన్ మోషెస్ రాజుకోరిక ప్రకారమే అలా చేశారు.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్నిప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లా ఎలాచేస్తారు? ఒక్కోఎమ్మెల్యేకి రెండు, మూడు రెవెన్యూడివిజన్లు పంచుతూ జిల్లాలను ఏర్పాటుచేయడం గందరగోళానికే దారితీస్తుంది. ఐపీఎస్ అధికారి గొప్పలుచెబుతున్నాడు.. తానేదో జిల్లాలఏర్పాటుపై మేథోమథనంచేశాడని డబ్బాలుకొట్టుకుంటున్నాడు.
విజయవాడ పక్కనున్న గన్నవరాన్ని తీసుకెళ్లి, మచిలీపట్నలో కలపడం.. పెనమలూరుని తీసుకెళ్లి మచిలీపట్నంలో పెట్టడమేనా మేథోమథనం? రాజంపేటనుతీసుకెళ్లి రాయచోటిలో పెట్టడమేంటి? హిందూపురం ప్రజలకు పుట్టపర్తి ఎంతదూరం? మడకశిర, హిందూపరం, ధర్మవరం ప్రాంతాలకు ఏది దగ్గరో, దూరమో విజయ్ కుమార్ కుతెలియదా?
కుప్పంగురించి మాట్లాడటంకాదు… పులివెందులలో బస్టాండ్ కూడాలేదనే వాస్తవాన్ని ముఖ్యమంత్రి ఎందుకు ఒప్పుకోరు? సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలను ఏర్పాటుచేయాలి. అలాకాకుండా తోచినవిధంగా చేసి, అంతా బాగాచేశామని చెప్పుకుంటే సరిపోతుందా?
ఈ ప్రభుత్వంలో సామాజికన్యాయం అనేది పూర్తిగా కొరవడింది. అంబేద్కర్ పేరుతో ఒక్క జిల్లాను కూడా ఎందుకుఏర్పాటుచేయలేపోయారు? ఈ నెలలో ఆయన జయంతి వస్తోంది.. ఆసందర్భంగా అయినా కనీసం ఆ మహానుభావుడిపేరుతో జిల్లాఏర్పాటుచేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చేయకపోవడం దుర్మార్గం. పరిపాలనా సౌలభ్యం అనేమాటకు కూడా తావులేకుండా ముఖ్యమంత్రి తనకు తోచినట్లుగా జిల్లాలను విభజించాడు.
ప్రజలంతా సారా, మద్యంఅమ్మకాలు.. విద్యుత్ ఛార్జీలు.. పెరిగిన పన్నుల గురించి మాట్లాడ కూడదనే ముఖ్యమంత్రి జిల్లాల విభజన అంశాన్నితెరపైకి తెచ్చాడు. మూడేళ్లపాలనలో జిల్లాలఏర్పాటుకోసం ఎంతవరకు ప్రజాభిప్రాయసేకరణచేశారో మంత్రిపేర్నినాని సమాధానంచెప్పాలి. మచిలీపట్నం జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెడితే, ఆయనపై జగన్మోహన్ రెడ్డికి ప్రేమఉన్నట్టా? మరి అలాంటప్పుడు ఆయనపేరుతో ఉన్న పథకాలను ఎందుకు తీసేశారు?
అన్నాక్యాంటీన్లు ఎందుకు మూసేశారు? అన్నగారి పేరుతో విమానాశ్రయం ఏర్పాటుచేస్తే గతంలో రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పేరు తొలగించాడు. ఆ విషయం లక్ష్మీపార్వతికి తెలియదా? స్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారతరత్నకావాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది.. పోరాడుతోంది తెలుగుదేశం పార్టీనే. తెలుగు వారంతా గర్వపడే వ్యక్తైన ఎన్టీఆర్ ను కేవలం ఒక జిల్లాకు మాత్రమేపరిమితంచేసింది జగన్మోహన్ రెడ్డి.. వైసీపీప్రభుత్వం. జగజ్జీవన్ రామ్ ని, అంబేద్కర్ ని గౌరవించలేని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను గౌరవిస్తాడా?
తలా, తోకలేని రాష్ట్రంగా ఏపీని మార్చిన జగన్మోహన్ రెడ్డి, రాజధానే లేకుండాచేశాడు. రాజధానే లేని రాష్ట్రానికి మొండెంలేని జిల్లాలను ఏర్పాటుచేశాడు. రాజమహేంద్రవరం అనే పేరుపలకలేని దుస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఎందుకంతలా తత్తరపడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి చేసిన జిల్లాల విభజనతో ప్రజలందరికీ ఇబ్బందులే.
తెలుగుదేశంపార్టీ అధికారంలోకివచ్చిన వెంటనే జిల్లాలవిభజనలో జరిగిన అన్యాయాన్ని, అశాస్త్రీయతను పూర్తిగా తొలగిస్తామని తెలియచేస్తున్నాను. మద్యాన్ని ఏరులైపారిస్తూ… విద్యుత్ ఛార్జీల భారంప్రజలపై మోపిన ముఖ్యమంత్రి ప్రజలను ఏమార్చడానికే కొత్తజిల్లాల రాగం ఆలపిస్తున్నాడు. దళితులకు తన మూడేళ్ల పాలనలో చేసిన అన్యాయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలడా? జిల్లాల ఏర్పాటు సందర్భంగా జరిగిన ర్యాలీల్లో మంత్రులెవరూ కనిపించలేదు. మంత్రిపదవి ఆశిస్తున్న ఆశావహులే.. బలప్రదర్శన ర్యాలీలు నిర్వహించారు. బొత్ససత్యనారాయణ జిల్లాపరిషత్ లు యథావిధిగా కొనసాగుతాయం టున్నారు.
జిల్లాలు వేరైనప్పుడు జిల్లా పరిషత్ లు యథావిథిగా ఉండటం ఏమిటి? ఇక్కడే అర్థమవుతోంది.. ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ కు జిల్లాలఏర్పాటుపై ఎంత అవగాహనఉందో చెప్పడానికి. జిల్లాలుసరే.. ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలు… ఆర్డీవో ఇతర అధికారుల నియామకాలు ఎలాచేపడతారో చెప్పండి. అధికారుల నియామకం….వారిస్థానికత.. ప్రమోషన్లపై ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేసిందో పేర్నినాని చెప్పగలడా? 610జీవో వల్ల ఇబ్బందులుపడుతున్న అధికారులు, ఉపాధ్యాయు లను ఏ జిల్లాలప్రాతిపదికన పరిగణలోకి తీసుకుంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.