Suryaa.co.in

Telangana

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హౌస్ అరెస్ట్

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ని గురువారం హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల పెంపుదలను నిరసిస్తూ… తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నక్లెస్ రోడ్డులోని ఇందిరమ్మ విగ్రహం వద్ద నుంచి విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి బయలుదేరకుండా
bhatti-houseతెల్లవారుజామున బంజారాహిల్స్ లోని బి.యన్.రెడ్డి కాలనీ లో గల భట్టి విక్రమార్క ఇంటికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని ముట్టడించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
పోలీసులు అరెస్టు చేయడం పట్ల భట్టి విక్రమార్క ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును సైతం తెలంగాణ ప్రభుత్వం కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ మంత్రులు, గులాబీ పార్టీ నాయకులు జాతీయ రహదారుల దిగ్బంధం, ధర్నాలు చేస్తే అడ్డుకొని పోలీసులు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకునే పోలీసులు టిఆర్ఎస్ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలను ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. చట్టం అందరికీ సమానం కాదా? టీఆర్ఎస్ కు ఏమైనా చుట్టమా అని ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలు పేరిట రైతు రాజకీయం చేయడం టిఆర్ఎస్, బీజేపీలు మానుకోవాలి. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్రమే కొనుగోలు చేసి ఆ తర్వాత కేంద్రం తో యుద్ధం చేయాలి. సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే ప్రజలు కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE