మోపిదేవి లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ను ఆప్కాబ్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ తొండేపు దశరథ జనార్ధన్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
తొలుత మోపిదేవి ఆలయం వద్ద టిడిపి రాష్ట్ర నాయకులు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక
కార్యదర్శి రావి రత్నగిరి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో స్వామివారి నాగ పుట్టలో పాలు పోసి , పుట్ట పూజ అనంతరం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించి తమ చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించగా, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో కోడూరు మండల టిడిపి అధ్యక్షులు బండే శ్రీనివాసరావు, మాజీ జెడ్ పి టి సి కాగిత రామారావు, తెలుగు యువత నాయకులు కాంతారావు వీరబాబు, గాంధీ, తదితరులు పాల్గొన్నారు.