Suryaa.co.in

Features

మౌనమె నీ భాష..!

*_మౌనమే శోధన.._*
*_ఆ మౌనమే సాధన.._*
*_అదే భాష.._*
*_అదే గుండె ఘోష.._*
*_మనిషై పుట్టి జ్ఞానమార్జించి.._* *_మదమాత్సర్య_*
*_రాగద్వేషాలను నిర్జించి_*
*_ఐహిక భోగాలను విసర్జించి_*
*_మహర్షిగా అవతరించి.._*
*_రమణుడు రమణ మహర్షి_*
*_అయినాడు.._*
*_జగతిని ఉద్దరించినాడు!_*

*_ఆ మౌనం అర్థం చేసుకుంటే అదే జ్ఞానం.._*
*_ఉపనిషత్తులను మించి.._*
*_వేదాలను గ్రహించి_*
*_తాను నిగ్రహించి.._*
*_భక్తులను అనుగ్రహించిన_*
*_రమణుడి మౌనంలోనే_*
*_గీతసారం.._*
*_ఆ మౌనం వీడి మాటాడితే_*
*_అదప్పుడు సకల వేదసారం!_*

*_సమాధి..ముక్తికి పునాది.._*
*_అయితే మరణించాక_*
*_శవమై చేరేది కాదు.._*
*_ఉన్నప్పుడే ప్రకృతి_*
*_నీ వశమై_*
*_సాధించే అలౌకిక పథం.._*
*_దేవుని చేరేందుకు_*
*_అదే రమణుడి విధం.._*
*_భగవంతుణ్ణి చేరేందుకు_*
*_అదే ఆయుధం..!_*

*_అరుణాచలం.._*
*_ఏంటో అంత అనుబంధం_*
*_ఆ పేరు వినగానే అల్లరి కుర్రాడు_*
*_వెంకట్రామన్ లో_*
*_ఓ కదలిక.._*
*_అప్పుడే మొదలై అంతర్మథనం.._*
*_ఆధ్యాత్మికతకు దొరికింది_*
*_సరికొత్త మూలధనం.._*
*_మౌనమే అయింది_* *_మానధనం..!_*

*_నమ్మని చలం కూడా_*
*_నచ్చిన వైనం.._*
*_ఆ మొండిఘటం మైదానం_*
*_ఒకనాటికి అయింది_*
*_రమణస్థానం.._*
*_ఆ భిన్నధృవాల.._*
*_విభిన్న దృక్పథాల_*
*_బంధానికి నిజస్థానం..!_*
*_అలా ఏదో ఒక దశలో_*
*_మారి ఉంటుందేమో_*
*_పెంకి మనిషి ప్రస్థానం!!_

*_నేను ఎవరు.._*
*_ఈ ప్రశ్న రమణుడిదే.._*
*_సమాధానమూ ఆయనదే.._*
*_ఎన్నో సందేహాలకు ఆయన దేహమే జవాబు.._*
*_ఎన్నెన్నో సాధించినా_*
*_ఆయన నిత్య గరీబు.._*
*_కాని..తిరుగులేని_*
*_ఆధ్యాత్మిక నవాబు!!_*

ఎలిశెట్టి సురేష్ కుమార్
*9948546286*

LEAVE A RESPONSE