Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి అరాచక పాలనలో కోర్టుకు కూడా రక్షణ లేకుండా పోయింది.

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ రెడ్డి అరాచక పాలనలో న్యాయస్థానాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థని కించపర్చారు, జడ్జీలను బెదిరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులో దొంగతనానికి పాల్పడి ఆధారాలను సైతం కొట్టేస్తున్నారు వైకాపన్లు. మూడు నెలల క్రితమే ప్రభుత్వం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నకిలీ పత్రాల కేసు ఉపసంహరించుకోవాలని ప్రయత్నించి భంగపడింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ప్రభుత్వాలు ఇష్టారీతిన విత్ డ్రా చెయ్యడానికి వీల్లేదని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయంటూ స్పెషల్ కోర్టు రిజక్ట్ చేసింది. జూన్ లో వాదనలు ప్రారంభమైతే జైలుకి వెళ్లడం, మంత్రి పదవి ఊడటం ఖాయమనే భయంతోనే
నకిలీ మద్యం, నకిలీ పత్రాల కేసుల్లో నిందితుడు క్రిమినల్ కాకాణి మంత్రై మూడు రోజులు కాకముందే తన పై ఉన్న ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసులో కీలక ఆధారాలు మాయం చేశారు. నెల్లూరులోని నాలుగో ఏడీఎం కోర్టులో జరిగిన చోరీ పై సమగ్ర విచారణ జరగాలి. కేసులో కీలక ఆధారాలైన పత్రాలు, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ను కొట్టేసిన కేటుగాళ్లు వారి వెనుక ఉన్న క్రిమినల్స్ ని కఠినంగా శిక్షించాలి. కోర్టులకు రక్షణ కల్పించాలి.

 

LEAVE A RESPONSE