– పారదర్శక విచారణకు ఆదేశాలు
అమరావతి: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ గురువారం సత్వరమే స్పందించింది. ఘటన వివరాలు ఆరాతీసి సీరియస్ గా రంగంలోకి దిగింది. ఈమేరకు కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాతో ఫోన్ లో మాట్లాడారు. కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో జాప్యం లేకుండా వ్యవహరించాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఆమె కోరారు. మీడియాలో వస్తున్న రాజకీయ ఆరోపణల్ని దృష్టిలో ఉంచుకుని కేసును పారదర్శక విచారణతో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి ఆరోగ్యం విషయంలో తగిన వైద్యం సక్రమంగా అందించాలని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను వాసిరెడ్డి పద్మ ఆదేశించారు.