– మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమే
– కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్టు హాజరవ్వాల్సిందే
– మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
విజయవాడ : చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్ అంటే తూతూమంత్రంగా నడిపారు.ఇప్పుడు వారందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. మహిళా కమిషన్ సుప్రీమా? అని బోండా ఉమా అడుగుతున్నాడు.అవును, కమిషన్ నీలాంటి వారికి సుప్రీమే. మహిళలని వేధించే వారికి కమిషన్ సుప్రీమే. యువతిపై అఘాయిత్యం పట్ల ఎవరు చేసినా అది నేరమే.
బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబుకు తెలియదని నిన్ననే అర్దమైంది. యుద్దానికి వెళ్తున్నట్టు పెద్ద సంఖ్య లో వచ్చారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాగ చేస్తున్నారో? మనసు, శరీరం గాయం అయిన యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అత్యాచార బాధితురాలితో ఎలా మాట్లాడాలో తెలియదా? అలాంటి వారిక సమన్లు ఇచ్చే అధికారం మహిళా కమిషన్ కు ఉంది.గతంలో చాలా కేసులో పోలీసు అధికారులకు కూడా ఇచ్చాం. వారానికి యాభై అరవై సమన్లు ఇస్తున్నాం.
బోండా ఉమ మహిళా కమిషన్ పై ఆరోపణలు చేస్తున్నాడు.కోట్లాది మంది మహిళలకు నేను బాధ్యురాలిని. నా హక్కులు నాకు ఉన్నాయి. నేను రాజకీయ నాయకురాలినైతే అప్పుడు వేరేగా ఉండేది. 27న చంద్రబాబు, బోండా ఉమా కమిషన్ ఎదుట హాజరు కావాల్సిందే. లొసుగులతో బయట పడేలా ప్లాన్ చేస్తున్నారు. న్యాయవాదులతో మాట్లాడుతున్నారట. బాధితురాలి దగ్గర బల ప్రదర్శన చేయటం ఏంటి? నామీద సవాల్ చేయటం ఏంటి?
ఆ ఘటనని రాజకీయం చేయటం తప్ప వారిలో సానుభూతి ఏదీ?ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కూడా అత్యాచార బాధితురాలిని పరామర్శించలేదు. చంద్రబాబు. అలాంటి వ్యక్తి నిన్న ఆస్పత్రిలో రచ్చరచ్చ చేశారు. సమన్లు ఎందుకు ఇచ్చామో చాలా స్పష్టంగా చెప్పాము. కచ్చితంగా వారిద్దరినీ కమిషన్ ఎదుట హాజరు పడేలా చేస్తాం.
వారిష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కమిషన్ తల వంచుకోవాలా?
కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్టు హాజరవ్వాల్సిందే. చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని అడగాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారు. వీరా మహిళలకు న్యాయం చేసేది బాధిరాలి కుటుంబాన్ని సీఎం కలిసేలా కమిషన్ చూస్తుంది. అసలు ఏ అత్యాచార ఘటన దగ్గరకు చంద్రబాబు వెళ్లారు? రిషితేశ్వరి కేసులో ఆర్నెళ్లు ఏం చేశారని లోకేష్ తన త డ్రిని అడగాలి. వనజాక్షి కేసులో ఏం చేయలేకపోయారెందుకని కూడా తన తండ్రిని అడగాలి.